అక్రమ కేసులపై జర్నలిస్టుల ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులపై జర్నలిస్టుల ఆగ్రహం

Oct 18 2025 6:35 AM | Updated on Oct 18 2025 7:37 AM

విజయనగరం అర్బన్‌/గజపతినగరం/రాజాం/చీపురుపల్లి: ప్రజాపక్షంగా వార్తలు ప్రచురిస్తున్న ‘సాక్షి’పై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనా యించడంపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది భావప్రకటన, పత్రికా స్వేచ్ఛను నెరిపే ప్రయత్నమని పేర్కొన్నారు. నకిలీ మద్యం తయారీ అంశాన్ని వెలుగులోకి తెచ్చిన సాక్షి మీడియాపై అక్కసు ఎందుకు ‘బాబూ’ అంటూ ప్రశ్నించారు. ‘సాక్షి’ ఎడిటర్‌ ధనంజయరెడ్డికి పదేపదే నోటీసులు ఇవ్వడాన్ని ఆక్షేపిస్తూ ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఆందోళనలు చేశారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్‌ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రజాపక్షంగా నిలిచే పత్రికల గొంతు నొక్కేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేయడమే అన్నారు. వార్తలు సహేతుకంగా లేవని భావిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ప్రజాస్వామ్య పద్ధతి అని, ప్రభుత్వం ఆ మార్గాన్ని పక్కన పెట్టి అక్రమ కేసులు పెట్టి మీడియాపై దాడులు చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తే రానున్న రోజుల్లో జర్నలిస్టులమంతా సంఘటితమై అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తేయాలని కోరుతూ విజయనగరంలోని జర్నలిస్టుల బృందం కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ నిరసన కార్యక్రమానికి ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ మద్దతు తెలిపింది. సాక్షి బ్యూరో చీఫ్‌ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు పీవీ శివప్రసాద్‌, జిల్లా అధ్యక్షుడు మహాపాత్రో, సీనియర్‌ జర్నలిస్టులు పి. అప్పారావు, లక్ష్మణరావు, వి. శ్రీనివాసరావు, చిన్న మధ్యతరహా పత్రికల ఎడిటర్ల సంఘం అధ్యక్షుడు కేజేశర్మ, ఎస్‌. నాగరాజు, రవికుమార్‌, శెట్టి గోవిందరావు, రాజేష్‌, వి.జగన్నాథవెంకట్‌, రాజేంద్ర, విజయలక్ష్మి, సునీతారెడ్డి, సీమా పాల్గొన్నారు.

● సాక్షి దినపత్రిక ఎడిటర్‌ దనంజయరెడ్డితో పాటు జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలంటూ గజపతినగరంలోని పాత్రికేయులు సీఐ జీఏవీ రమణకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రిపోర్టర్లు ఎస్‌.తిరుపతిరావు, గోవిందరావు, వెంకటరమణ, రత్నాకర్‌, జగదీష్‌, వెంకటరావు, రవి, పాల్గొన్నారు.

● నకిలీ మద్యం వ్యవహారాన్ని బయటకు తీయడంతో పాటు కూటమి అరాచకాలు, అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తున్న సాక్షి దినపత్రిక గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను రాజాం ప్రెస్‌క్లబ్‌ ఖండించింది. రాజాంలోని తహసీల్దార్‌ కార్యాలయం వద్ద జర్నలిస్టులు కాసేపు ఆందోళన చేసి తహసీల్దార్‌ ఎం.రాజశేఖరానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నీలకంటేశ్వరయాదవ్‌, కె.శ్రీనివాసరావు, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు పి.వెంకటరావు, సభ్యులు పి.వెంకటరావు, శేఖర్‌, కిశోర్‌, రామారావు, ఉపేంద్ర, గణేష్‌, ఎస్‌.సత్తీష్‌, వి.శ్రీనివాసరావు, మన్మథకుమార్‌, రాజేష్‌, కె.సురేష్‌ పాల్గొన్నారు.

● జర్నలిజంపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నిస్తున్న కూటమి చర్యలను చీపురుపల్లి తాలూకా జర్నలిస్టు ఫెడరేషన్‌ (టీజేఎఫ్‌) నాయకులు ఖండించారు. చీపురుపల్లిలోని ప్రెస్‌క్లబ్‌ నుంచి మూడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. పత్రికాస్వేచ్ఛకు సంకెళ్లు వేయడం సిగ్గుసిగు అంటూ నినదించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ పరిపాలన అధికారి(ఏఓ) ఆర్‌.ఈశ్వరమ్మకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో టీజేఎఫ్‌ ప్రతినిధులు బి.రామారావు, కె.హరీష్‌, ఐ.గణేశ్‌, కె.సత్యనారాయణ, పి.ఉమ, ఎస్‌.వి.సత్యనారాయణరాజు, బాలాజీ, ఎస్‌.వెంకటేశ్వరరావు, ఆదినారాయణ, రామారావు, సతీష్‌, పైడినాయుడు, అప్పలనాయుడు, కనకరాజు, నరేష్‌, రవి, రమేష్‌, చిన్న, మణి, శ్రీను, నర్సింగ్‌, పవన్‌, మురళి పాల్గొన్నారు.

● ‘సాక్షి’పై కూటమి కక్షసాధింపులకు నిరసనగా బొబ్బిలి ప్రెస్‌క్లబ్‌, జర్నలిస్టు సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో బొబ్బిలిలో ఆందోళన చేశారు. అనంతరం ఆర్డీఓ జేవీవీఎస్‌ రామమోహన రావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.వ్యాస్‌బాబు, చుక్క జగన్మోహనరావు, ఆర్‌.జగదీశ్వరరావు, బి. కృష్ణమూర్తి, వి. తిరుమలరావు, మహ్మద్‌ రఫీ, కె. ఆదినారాయణ, రాజేష్‌, కిశోర్‌, వెంకినాయుడు పాల్గొన్నారు.

పత్రికా స్వేచ్ఛను హరించడం సిగ్గుసిగ్గు

‘సాక్షి’పై అక్కసు ఎందుకు బాబూ..?

జర్నలిస్టులపై అక్రమ కేసులను నిరసిస్తూ ఆందోళన

ప్రజాపక్షంగా వార్తలు రాస్తున్న పత్రికల గొంతునొక్కడం తగదు

‘సాక్షి’ ఎడిటర్‌ ధనంజయరెడ్డికి నోటీసులు ఇవ్వడంపై నిరసన

దాడులు ఆపకపోతే అసెంబ్లీని

ముట్టడిస్తామని హెచ్చరిక

అక్రమ కేసులపై జర్నలిస్టుల ఆగ్రహం 1
1/5

అక్రమ కేసులపై జర్నలిస్టుల ఆగ్రహం

అక్రమ కేసులపై జర్నలిస్టుల ఆగ్రహం 2
2/5

అక్రమ కేసులపై జర్నలిస్టుల ఆగ్రహం

అక్రమ కేసులపై జర్నలిస్టుల ఆగ్రహం 3
3/5

అక్రమ కేసులపై జర్నలిస్టుల ఆగ్రహం

అక్రమ కేసులపై జర్నలిస్టుల ఆగ్రహం 4
4/5

అక్రమ కేసులపై జర్నలిస్టుల ఆగ్రహం

అక్రమ కేసులపై జర్నలిస్టుల ఆగ్రహం 5
5/5

అక్రమ కేసులపై జర్నలిస్టుల ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement