
తప్పుడు ప్రచారం చేశారు
పచ్చకమెర్లతో విద్యార్థినులు మృతిచెందితే సరైన వైద్యం చేయించుకోలేదని, నాటువైద్యం చేయించుకోవడం వల్ల మృతిచెందారంటూ అధికారులతో తప్పుడు ప్రచారం చేయించడం సిగ్గుచేటు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల పాలన కాలంలో 15 మంది విద్యార్థులు మృతిచెందారు. అందులో నెలరోజుల వ్యవధిలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సొంత మండలంలో ముగ్గురు విద్యార్థులు, సొంత నియోజకవర్గానికి చెందిన మరో ఇరువురు విద్యార్థులు కలిపి ఐదుగురు మృతిచెందారు. ఇప్పటికై నా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కళ్లు తెరవాలి. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున్న పరిహారం అందజేయాలి. – పీడిక రాజన్నదొర,
మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి
మరెంత మంది ప్రాణాలు పోయేవో..
కురుపాం గురుకుల పాఠశాల విద్యార్థినులు మృతిచెందిన సమాచారం తెలియగానే.. ఆయా కుటుంబాలను పరామర్శించాను. మృతికి గల కారణాలపై ఆరా తీసి పచ్చకామెర్ల వ్యాప్తిని వెలుగులోకి తీసుకురాకపోయి ఉంటే మరెంత మంది విద్యార్థినులు ప్రాణాలు పోగొట్టుకునే వారో తలచుకుంటేనే భయమేస్తోంది. అంజలి, కల్పనలకు ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించి ఉంటే బతికేవారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపడంతో మిగిలిన విద్యార్థులకు వైద్యసేవలు అందాయి. వి ద్యార్థుల సమస్యలు పరిష్కరించడంతో పాటు ప్రభు త్వ అలక్ష్యంపై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవహక్కుల కమిషన్, ఎస్టీకమిషన్ చైర్మన్లకు విన్నవించాం. – పాముల పుష్పశ్రీవాణి, మాజీ డిప్యూటీ సీఎం

తప్పుడు ప్రచారం చేశారు

తప్పుడు ప్రచారం చేశారు