
టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి...
దత్తిరాజేరు: మండల కేంద్రమైన దత్తిరాజేరులో గురువారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు పువ్వల శ్రీనివాసరావుతో పాటు పది కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు మహదేవ్ ఫణీంద్రుడు, మజ్జి అప్పలనాయుడు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. గతంలో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందేవని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజల సంక్షేమం కుంటుపడిందని ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.