
జీఎస్టీ తగ్గింపు వల్ల అన్ని వర్గాలకు ప్రయోజనం
విజయనగరం టౌన్: జీఎస్టీ శ్లాబ్‌ను రెండుకు తగ్గించడం వల్ల అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాంతీయ రవాణాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ వాహన ర్యాలీని కలెక్టరేట్ వద్ద గురువారం ఆయన జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టరేట్ నుంచి ఆర్‌అండ్‌బీ జంక్షన్, సంతకాల వంతెన, ఆర్‌టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జేసీ సేతు మాధవన్, డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, ఉప రవాణాధికారి డి.మణికుమార్, ఆర్‌టీఓ విమల, సీనియర్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు దుర్గాప్రసాద్, రవిశంకర్ ప్రసాద్, శివరాంగోపాల్, సంగీత కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మండపాక నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.