
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
నెల్లిమర్ల: స్థానిక చంపావతినదిలో బుధవారం గల్లంతైన కనకల అప్పారావు(46) మృతదేహం లభ్యమైంది. జరజాపుపేటకు చెందిన కనకల అప్పారావు థామస్‌పేట వద్ద చంపావతినదిలో స్నానానికి దిగి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మునిగిపోయి గల్లంతైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపకసిబ్బంది గాలింపు చేపట్టగా కొండపేట వెళ్లే రహదారిలో జూట్‌మిల్లు వద్ద మృతదేహం గురువారం లభ్యమైంది. మృతదేహానికి పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం పోలీసులు తరలించారు.
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి–చీపురుపల్లి రైల్వేస్టేషన్‌ల మధ్య రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని శ్రీకాకుళం జీఆర్‌పీ హెచ్‌సీ ఎస్.మధుసూదనరావు తెలిపారు. పాండిచ్చేరి నుంచి హౌరా వెళ్లే రైలు ఢీకొట్టగా మృతి చెందాడన్నారు. మృతుడి వయస్సు సుమారు 45 సంవత్సరాలు ఉంటుందని, చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీలో మృతదేహం ఉంటుందని తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు పోన్ 9110305494 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
బైక్ అదుపుతప్పి వ్యక్తి..
గుర్ల: మండలంలోని తెట్టంగి శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెనుబర్తికి చెందిన తాడేల అచ్యుతరావు (35) మృతి చెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..దీపావళి సందర్భంగా బాణ సంచా కొనుగోలు చేయడానికి పెనుబర్తి నుంచి గవిడి పేట వెళ్తుండగా తెట్టంగి దాటిన తర్వాత బైక్ ఆదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో జరిగిన ప్రమాదంలో అచ్యుతరావు అక్కడికక్కడే మృతిచెందాడు. అదే బైక్‌పై వెళ్తున్న గుషిడి నారాయణ రావుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన వ్యక్తిని చీపురుపల్లి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. మృతుడికి భార్య పార్వతి, ఇద్దరు కుమారులు వసంత్ కుమార్, తరుణ్ ఉన్నారు.

గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం