
ఎయిర్‌పోర్టు పనుల పరిశీలన
పూసపాటిరేగ: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను ఇండస్ట్రీస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.డి.కృష్ణబాబు ఏిపీఏడీసీఎల్ ఎం.డి.ప్రవీణ్, కలెక్టర్ రామసుందర్‌రెడ్డితో కలిసి శనివారం పరిశీలించారు. ట్రంపెట్ బ్రిడ్జి, విమానశ్రయానికి వెళ్లే అప్రోచ్‌రోడ్డు, ఎయిర్‌పోర్టు టెర్మినల్, రన్‌వేను పరిశీలించారు. నిర్మాణాలపై ఆరా తీశారు. మ్యాపును పరిశీలించారు. టెర్మినల్ భవనం మూడు అంతస్తులను తనిఖీ చేశారు. అనంతరం ఎయిర్‌పోర్టు కార్యాలయం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎయిర్‌పోర్టుకు నీటి సరఫరా, విద్యుత్, వర్షపునీరు వెళ్లే మార్గాలు, మిగిలిన భూసేకరణ, పరిహారం చెల్లింపులు, న్యాయ సంబంధిత అంశాలను అధికారులను అడిగితెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించి నిర్ణీత సమయంలో విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ ఎస్.సేతుమాధవన్, ఆర్డీఓ దాట్ల కీర్తి, ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ లక్ష్మణరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కాంతిమతి, పీఆర్ ఎస్‌ఈ శ్రీనివాసరావు, తహసీల్దార్ ఎం.రమణమ్మ, జీఎంఆర్ ఎయిర్‌పోర్టు సీఈఓ కన్వర్‌బీర్‌సింగ్ కలరా, ప్రాజెక్టు హెడ్ బీహెచ్ రామరాజు, సీడీఓ ఎం. కోటేశ్వరరావుతో పాటు ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.