
ప్రమాదానికి నిలయంగా ఆర్వోబీ
సీతానగరం: మండలంలోని వాహన చోదకులు రోడ్డెక్కితే ఏం జరుగుతుందోనని భయాందోళన చెందుతున్నారు. జాతీయ రహదారిపై నిరంతరం పార్వతీపురం, బొబ్బిలి మీదుగా రోజూ వందలాది వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. మార్గమధ్యంలో రోడ్డు, వంతెనపై భారీ స్థాయిలో గోతులు ఏర్పడడంతో నెల రోజులుగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గోతుల్లో వాహనాలతో జరుగుతున్న ప్రమాదాల్లో నిండు ప్రాణాలు పోతున్నా ఇంతవరకూ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. రోడ్డు ప్రమాదాలను చూస్తున్న పోలీసులు కొంతమేర గోతులు పూడ్చుతున్నా వర్షాలు, భారీ వాహనాలు వందల సంఖ్యలో మరమ్మతుల సమయంలో తిరుగాడడం వల్ల ఫలితం లేక పోతోంది. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రమాదానికి నిలయంగా ఆర్వోబీ

ప్రమాదానికి నిలయంగా ఆర్వోబీ

ప్రమాదానికి నిలయంగా ఆర్వోబీ