
రాష్ట్రస్థాయి పోటీలకు జూనియర్ కళాశాల విద్యార్థినులు
రాజాం సిటీ: స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ కుమరాపు జనార్దనరావు గురువారం తెలిపారు. ఇటీవల శ్రీకాకుళంలో నిర్వహించిన పోటీల్లో వాలీబాల్ విభాగానికి సంబంధించి మొదటి ఆరు స్థానాల్లో నిలిచిన టి.సూర్యకుమారి, ఎ.నిరోషి, ఎం.గౌతమి, ఎస్.జయశ్రీ, బి.వెంకటలక్ష్మి, సీహెచ్ పవిత్ర, కబడ్డీలో ఎస్.యశోని, స్విమ్మింగ్‌లో ఎల్.కల్పనలు అండర్–19 రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థినులను కళాశాల ఆవరణలో అభినందించారు. రాష్ట్రస్థాయిలో కళాశాలకు మంచి పేరుతీసుకురావాలని ఆకాంక్షించారు. అభినందించిన వారిలో ప్రిన్సిపాల్‌తోపాటు పీఎస్‌ఎన్‌గుప్త, ప్రసన్నకుమార్, అనిల్, అధ్యాపకులు తదితరులు ఉన్నారు.