
తెప్పోత్సవం ట్రయల్ రన్ సక్సెస్
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవ ట్రయల్ రన్ విజయవంతమైంది. సోమవారం ఉద యం 11 గంటలకు పెద్దచెరువులో సుమారు 40 మందితో ఆలయ ఇన్‌చార్జి ఈఓ కె.శిరీష, ఆర్డీఓ కీర్తి, వన్‌టౌన్ సీఐ చౌదరితో పాటు మత్స్యశాఖ అధికారులు తెప్ప ట్రయల్ రన్‌లో పాల్గొన్నారు. హంసవాహనంపై అమ్మవారు విహరించే ప్రదేశాల్లోకి తెప్పను తీసుకువెళ్లారు. ఆ ప్రాంతమంతా పరిశీలన చేశారు. అనంత రం ఆర్డీఓ కీర్తి మాట్లాడుతూ తెప్పోత్సవ ఏర్పాట్లను పైడితల్లి అమ్మవారి దేవస్థానం అధికారులు పూర్తిచేశారన్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి పెద్దచెరువులో అమ్మవారు హంసవాహనంపై విహరిస్తారన్నారు. కేవలం 20 మంది మాత్రమే తెప్పలోకి అనుమతి ఉందన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అర్జీదారు సమస్యను అర్ధం చేసుకోవాలి
● కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: అర్జీదారు సమస్యను పూర్తిగా అర్ధం చేసుకోవాలని, వారు చెప్పే విషయాన్ని ఓపిగ్గా వినాలని, అప్పుడే వారికి సంతృప్తి కలుగుతుందని కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీజీఆర్‌ఎస్ వినతులపై కలెక్టర్ సోమవారం సమీక్షించారు. వినతులపై స్వయంగా సంబంధిత అధికారే ఎండార్స్‌మెంట్ వేయాలని, కిందిస్థాయి అధికారులకు అప్పగించకూడదని తెలిపారు. జిల్లాలో రీ ఓపెన్ అయిన కేసులు 2.83 శాతం ఉన్నాయని, రీ ఓపెన్‌కు గల కారణాలను ఆయా అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో డీఆర్వో శ్రీనివాసమూర్తి, సీపీఓ బాలాజీ, డిప్యూటీ కలెక్టర్ మురళి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జేఎన్‌టీయూ జీవీ వీసీ బాధ్యతల స్వీకరణ
● విద్యాప్రమాణాల మెరుగుకు కృషిచేస్తా: వీసీ వి.వి.సుబ్బారావు
విజయనగరం రూరల్: జేఎన్‌టీయూ–గురజాడ విశ్వవిద్యాలయం ఉప కులపతిగా (వీసీ) వి.వెంకట సుబ్బారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జేఎన్‌టీయూ కాకినాడ రెక్టార్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఉద్యోగోన్నతిపై వీసీగా నియమిస్తూ ఈ నెల 8న ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన వర్సిటీ అధికారులు, ఆచార్యుల సమక్షంలో తాజాగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరు లతో మాట్లాడుతూ విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెంపునకు చర్యలు తీసుకుంటానన్నారు. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థిరపడేలా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. వర్సిటీలో మౌలిక సదుపాయాల పెంపు, బోధన సిబ్బంది నియామకంతోపాటు విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది, అధికారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
పదోన్నతి కల్పించండి
విజయనగరంఫోర్ట్: అర్హతకలిగిన మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలుగా పదోన్నతి కల్పించాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షరాలు బి.పైడిరాజు డిమాండ్ చేశారు. విజయనగరం కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో సుమారుగా 284 మంది మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు 15 ఏళ్లుగా పనిచేస్తున్నారన్నారు. మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు విధుల్లో చేరినప్పుడు 10వ తరగతి సర్టిఫికెట్స్ సమర్పించినప్పటకీ అధికారులు సరిగా చూడ క, 10వ తరగతిలోపు చదివినట్లుగా ఆన్‌లైన్‌లో తప్పుగా నమోదు చేయడంతో అర్హత ఉన్నప్పటికీ అన్యాయానికి గురయ్యారన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు వి. లక్ష్మి, జి.ఉష, బి.వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

తెప్పోత్సవం ట్రయల్ రన్ సక్సెస్

తెప్పోత్సవం ట్రయల్ రన్ సక్సెస్

తెప్పోత్సవం ట్రయల్ రన్ సక్సెస్