
వణికించిన గాలివాన
● ఉప్పొంగిన నాగావళి
విజయనగరం ఫోర్ట్:
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో విజయనగరం జిల్లాలో గురువారం గాలివాన బీభత్సవం సృష్టించింది. నదులు, వాగులు పొంగిప్రవహించాయి. పంటలను ముంచెత్తాయి. ఈదురుగాలులకు విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో గంటల తరబడి సరఫరాకు అంతరాయం కలిగింది. ఇప్పటికీ పలు గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. నిన్న, మొన్నటి వరకు పంటకు అవసరమైన యూరియా, డీఏపీ ఎరువులు కోసం రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. తాజాగా వర్షాలు కారణంగా పంటలకు నష్టం వాటిల్లిడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు 135 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పూసపాటిరేగ, దత్తిరాజేరు, డెంకాడ, మెంటాడ, నెల్లిమర్ల, చీపురుపల్లి, సంతకవిటి మండలాల్లో అధిక విస్తీర్ణంలో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు గుర్తించారు.
14 మండలాల్లో ఉద్యాన పంటలకు నష్టం
జిల్లాలోని 14 మండలాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. బొప్పాయి 33.6 హెక్టార్లు, అరటి 105.6 హెక్టార్లు, కూరగాయలు 2.8 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. చీపురుపల్లి, గరివిడి, మెరకమడిదాం, బొబ్బిలి, దత్తిరాజేరు, గజపతినగరం, మెంటాడ, పూసపాటిరేగ, బాడంగి, తెర్లాం, రామభద్రపురం, నెల్లిమర్ల, గంట్యాడ, ఎస్.కోట మండలాల్లో 424 మంది రైతులకు చెందిన 142 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టు గుర్తించారు.
విద్యుత్ శాఖకు భారీ నష్టం
గాలివానకు జిల్లా వ్యాప్తంగా 251 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల స్తంభాలు విరిగిపోగా, మరికొన్ని చోట్ల నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన సంబంధిత శాఖ అధికారులు చేపట్టారు. అయితే, ఇప్పటికీ చాలా గ్రామాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు జరగలేదు. గంట్యాడ మండలంలోని పెదమధుపాడ, బుడతానపల్లి గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. బోనంగి గ్రామంలో 30 శాతం విద్యుత్ సరఫరా కాలేదు.
నష్టాన్ని అంచనా వేస్తున్నాం
135 హెక్టార్ల విస్తీర్ణంలో వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేశాం. ఉద్యాన పంటలు బొప్పాయి. అరటి, కూరగాయాలు 142 హెక్టార్లలో దెబ్బతిన్నట్టు గుర్తించాం. శనివారం నుంచి పంట నష్టం సర్వేచేస్తాం. ఆ వివరాలను ఉన్నతాధికారులకు పంపిస్తాం. దెబ్బతిన్న 251 విద్యుత్ స్తంభాల్లో 134 స్తంభాలను పునరుద్ధరించినట్టు వ్యవసాయ, ఉద్యానవన, విద్యుత్‌శాఖ అధికారులు భారతి, కె.చిట్టిబాబు, మువ్వలక్ష్మణరావు తెలిపారు.
మెంటాడ మండలంలో నెలకొరిగిన మొక్క జొన్న
సంతకవిటి: భారీ వర్షాలకు నాగావళి నది ఉప్పొంగింది. నారాయణపురం ఆనకట్టవద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గాలివానకు విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో సరఫరా నిలిచిపోయింది. జావాం సమగ్ర మంచినీటి సరఫరా పంపుహౌస్ పనిచేయకపోవడంతో పలు గ్రామాల ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడ్డారు. హొంజరాం, మేడమిర్తి, బూరాడపేట, తమరాం, రంగారాయపురం, జావాం తదితర గ్రామాల్లో చెరకు పంట నేల వాలింది.
సంతకవిటి: నారాయణపురం ఆనకట్ట వద్ద వరద ఉద్ధృతి
ఉప్పొంగిన నదులు, వాగులు
వరి, మొక్కజొన్న, పత్తి, అరటి పంటలకు నష్టం
నేలకూలిన 251 విద్యుత్ స్తంభాలు
అంధకారంలో పల్లెలు

వణికించిన గాలివాన

వణికించిన గాలివాన

వణికించిన గాలివాన

వణికించిన గాలివాన

వణికించిన గాలివాన

వణికించిన గాలివాన