
● అధికారులు అప్రమత్తంగా ఉండాలి
రేగిడి: అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నాగావళి నది ఉగ్రరూపం దాల్చిందని, నదీ తీర ప్రాంతాల్లో పనిచేసే అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి ఆదేశించారు. సంకిలి, బొడ్డవలస గ్రామాల వద్ద నాగావళి నదిని పరిశీలించారు. నదిలో మడ్డువలస ప్రాజెక్టు నుంచి 11వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టడంతో తీర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని తహసీల్దార్ ఐ.కృష్ణలతను ఆదేశించారు. వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు తీరగ్రామాల్లోనే బసచేయాలని సూచించారు. పంట నష్టాలను అంచనా వేయాలని ఏఓ బి.శ్రీనివాసరావును ఆదేశించారు.