
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
విజయనగరం క్రైమ్: నగరంలోని హుకుంపేటకు చెందిన పైడితల్లి(50) విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు విజయనగరం టూటౌన్ ఏఎస్సై రామారావు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పైడితల్లికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యతో విడాకులు తీసుకుని రెండో భార్యతో నివసిస్తున్నాడు. సైకిల్ టైర్ పంక్చర్ రిపేర్ తో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. రోజులాగానే పనిలోకి వెళ్లిన పైడితల్లికి అక్కడే కరెంట్ షాక్ తగలడంతో మృత్యువాత పడ్డాడు. మృతుడి భార్య మంగ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.