
విజయాలకు నాంది కావాలి
విజయనగరం: విజయదశమి ప్రతి ఒక్కరి విజయాలకు, ప్రగతికి నాంది కావాలని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలందరికీ ఆయన బుధవారం ఓ ప్రకటనలో దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుమీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకొనే దసరా పండగ, మనందరి జీవితాల్లో సుఖ సంతోషాలకు, విజయాలకు పునాది వేయాలని ఆకాంక్షించారు. దుర్గామాత అందరినీ చల్లగా చూడాలని, సంపూర్ణ శక్తినివ్వాలన్నారు. నవ దుర్గల స్ఫూర్తిగా ప్రతిమహిళా అభివృద్ధివైపు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టుకు బుధవారం వరద ప్రవాహం పెరిగింది. వేగావతి, సువర్ణముఖి నదుల నుంచి 10,500 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు వద్ద 64.28 మీటర్ల మేర నీటిమట్టం నమోదైంది. బుధవారం నాలుగు గేట్లు ఎత్తివేసి 11వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడిచిపెట్టినట్టు ఏఈ నితిన్ తెలిపారు.
బొబ్బిలి: దశాబ్ద కాలంగా ఇంటింటి చెత్త సేకరణ, ప్లాస్టిక్, పాలిథిన్ సంచుల నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేస్తు న్న బొబ్బిలి మున్సిపాలిటీ రాష్ట్రస్థాయిలో ముందంజలో నిలిచి స్వచ్ఛాంధ్ర అవార్డుకు ఎంపికై ంది. ఈ విషయమై కమిషనర్ ఎల్.రామలక్ష్మి మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర అవార్డు రావడం సంతోషంగా ఉందని, బొబ్బిలిలో పారిశుద్ధ్య నిర్వహణకు సహకరిస్తున్న ప్రజలందరికీ అవార్డు ఫలాలు అందిస్తామన్నారు.
కోటదుర్గమ్మకు ప్రత్యేక పూజలు
పాలకొండ: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం మహిషాసుర మర్దినిగా కోటదుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తు లు అమ్మవారికి ఘటాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మొక్కుబడులు చెల్లించారు. గురువారం అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమివ్వనున్నారు.

విజయాలకు నాంది కావాలి

విజయాలకు నాంది కావాలి