
డ్వాక్రా ఉత్పత్తులకు చక్కని ఆదరణ
● డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్ పాణి
విజయనగరం టౌన్: జిల్లాలో డ్వాక్రా ఉత్పత్తులకు చక్కని ఆదరణ లభిస్తోందని, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా సంఘాలు తయారు చేసిన డ్వాక్రా ఉత్పత్తులు ప్రదర్శన, అమ్మకాలకు విజయనగరం వరుసగా మూడో ఏడాది వేదిక అయిందని సెర్ప్, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్ పాణి తెలిపారు. మాన్సాస్ గ్రౌండ్‌లోని డ్వాక్రా బజారును అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఆన్‌లైన్ మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు, మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి ఇటువంటి వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సరస్‌లో 244 స్టాల్స్‌ను పర్యవేక్షించేందుకు సెక్యూరిటీని నియమించామని, సీసీ కెమెరాలు ఏర్పాటుచేశామని తెలిపారు. కార్యక్రమంలో సీ్త్రనిధి మేనేజింగ్ డైరెక్టర్ హరిప్రసాద్, ఏపీడీ కె.సావిత్రి, సరస్ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, డీపీఎంలు రాజ్‌కుమార్, చిరంజీవి, సీతారామయ్య, లక్ష్మునాయుడు, తదితరులు పాల్గొన్నారు.