
పీజీఆర్‌ఎస్‌పై సీఎం పర్యటన ఏర్పాట్ల ప్రభావం
● కలెక్టర్, జేసీ లేకపోవడంతో తగ్గిన వినతులు
● డీఆర్‌ఓ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహణ
విజయనగరం అర్బన్: కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్‌ఎస్ కార్యక్రమంపై సీఎం జిల్లా పర్యటన ఏర్పాట్ల ప్రభావం పడింది. వినతుల స్వీకరణ కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లు లేకపోవడంతో సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన పలువురు ప్రజలు వెనుదిరిగారు. వినతులు ఇవ్వకుండా వెనుతిరిగిన అర్జీదారుల్లో ఎస్.కోట, విజయనగరం మండలాల నుంచి వచ్చిన రైతులు ఉన్నారు. పీజీఆర్‌ఎస్‌కు ప్రతి సోమవారం 200కు పైగా వచ్చే అర్జీలు ఈ వారం 134 మాత్రమే నమోదయ్యాయి. డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసమూర్తి అధ్వర్యంలో నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వర్రావు, మురళి, నూకరాజు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వాటిని పరిశీలించి, పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపించారు.
ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌కు 30 ఫిర్యాదులు
విజయనగరం క్రైమ్: ఎస్పీ ఆదేశాలతో విజయనగరం డీఎస్పీ గోవిందరావు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను పరేడ్ మైదానం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 30 మంది ఫిర్యాదు దారులు తమ సమస్యలను డీఎస్పీకి విన్నవించారు.

పీజీఆర్‌ఎస్‌పై సీఎం పర్యటన ఏర్పాట్ల ప్రభావం