
సీఎం రాక ఏర్పాట్ల పరిశీలన
దత్తిరాజేరు: దత్తి గ్రామానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం వస్తున్న సందర్భంగా గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్‌రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ సోమవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి పింఛన్లు పంపిణీ చేసే ఇళ్లకు వెళ్లే మార్గాలను, వాహనాల పార్కింగ్, కూటమి నాయకులతో సమావేశం కానున్న హాల్‌ను పరిశీలించారు. హెలిప్యాడ్ వద్దకు ఇతరులు రాకుండా కంచెను కట్టుదిట్టంగా వేయాలని, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధుల రాకపోకలకు అనువుగా అన్ని ఏర్పాట్లు ఉండాలని పోలీస్, ఇతర శాఖల అధికారులను అదేశించారు.