పత్తి రైతుకు వాన కష్టాలు | - | Sakshi
Sakshi News home page

పత్తి రైతుకు వాన కష్టాలు

Sep 30 2025 9:09 AM | Updated on Sep 30 2025 9:09 AM

పత్తి

పత్తి రైతుకు వాన కష్టాలు

తెగుళ్ల దాడి..

ప్రభుత్వం ఆదుకోవాలి

ఎకరా పొలం కౌలుకు తీసుకుని పత్తి పంట వేశాను. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒక్కో చెట్టుకు 30 నుంచి 40 కాయలు కుళ్లిపోయాయి. పత్తి దిగుబడి తగ్గడంతో పాటు నాణ్యత తగ్గిపోయింది. ఎకరాకు రూ.10వేలు వరకు నష్టం వచ్చే పరిస్థితి ఉంది. బ్యాంకు రుణం, వడ్డీ వ్యాపారుల వద్ద అప్పుచేసి పంటకు పెట్టుబడి పెట్టాం. ప్రభుత్వం ఆదుకోకుంటే అప్పుల్లో కూరుకుపోతాం. – చొక్కాపు నారాయణరావు,

పత్తి రైతు, రామభద్రపురం

పత్తి నాణ్యత తగ్గడం వాస్తవమే..

వర్షాలు కారణంగా పూర్తిగా విచ్చుకున్న పత్తి ముద్దలా తయారైంది. విచ్చుకుంటున్న కాయలో నీరు చేరి కాయ పూర్తిగా నల్లబా రిపోయింది. పత్తి నాణ్యత తగ్గింది. వర్షాలకు తేమ శాతం అధికమై ఆకులపై మచ్చలు ఏర్పడి పంట ఎరుపు రంగుకు వస్తుంది. దీని నివారణకు ముందుగా పొలంలో నీరు నిల్వ లేకుండా చేయాలి. తెగుళ్ల నివారణకు వ్యవసాయాధికారు సూచనమేరకు పురుగుమందు పిచికారీ చేస్తే మంచిది. రైతులకు ఎంత నష్టం జరిగిందన్నది ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తాను.

– ఎం.మధుసూదనరావు, వ్యవసాయశాఖ ఏడీఏ

రామభద్రపురం: వరిలో నష్టం వస్తుందని పత్తి పంటను సాగుచేసిన రైతన్నను వర్షాలు నట్టేటముంచాయి. పంట చేతికొచ్చ దశలో కురిసిన భారీ వర్షాలు కన్నీరు పెట్టాయి. వర్షపు నీరు పత్తికాయల్లో చేరడంతో కాయ కుళ్లిపోయింది. విచ్చుకునే పత్తి నల్లబడిపోవడాన్ని చూసిన రైతన్న తెల్లబోతున్నాడు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నాడు.

జిల్లాలో సుమారు 1911 హెక్టార్లలో పత్తి పంట సాగైనట్టు వ్యవసాయాధికారుల లెక్కలు చెబుతున్నాయి. పత్తికాయ ముదురి విచ్చుకునే సమయంలో కురిసి వర్షాలతో ఒక్కోచెట్టుకు సుమారు 30 నుంచి 40 కాయలు పాడయ్యాయి. వర్షపు నీరు పగుల్లోకి వెళ్లి బూజు పడుతున్నాయి. వానకు తడిసిన పత్తికాయలను ఏరి వాటిలో పత్తి తీసేందుకు కూలి ఖర్చులు తడిసిమోపెడవుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

రోజూ కురుస్తున్న వర్షాలతో కాయల్లోకి చేరుతున్న నీరు

నల్లగా మారి నాణ్యత తగ్గుతున్న పత్తి

పంటకు ఎర్ర, ఆకు ముడత తెగుళ్లతో భారీ నష్టం

ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు

ఓ వైపు వర్షాలు... మరోవైపు తెగుళ్లు పత్తి పంటపై దాడిచేసి రైతును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తేమ శాతం అధికం కావడంతో ఎర్ర తెగులు, పచ్చదోమ, ఆకుముడత తెగులు సోకి పంటకు నష్టం కలిగిస్తోంది. ఎకరాకు 2 నుంచి 2.5 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనుకుంటే ఇప్పుడు క్వింటా కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని, మరోవైపు ప్రకృతి ప్రకోపంతో పంట నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

పత్తి రైతుకు వాన కష్టాలు 1
1/4

పత్తి రైతుకు వాన కష్టాలు

పత్తి రైతుకు వాన కష్టాలు 2
2/4

పత్తి రైతుకు వాన కష్టాలు

పత్తి రైతుకు వాన కష్టాలు 3
3/4

పత్తి రైతుకు వాన కష్టాలు

పత్తి రైతుకు వాన కష్టాలు 4
4/4

పత్తి రైతుకు వాన కష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement