
● సరస్వతీ నమోస్తుతే...
శరన్నవరాత్రి ఉత్సవాలు వేళ.. సరస్వతీదేవి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం పురస్కరించుకుని రింగురోడ్డు ఎస్‌వీఎన్ నగర్‌లో కొలువైన ధన్వంతరీ, సప్తమేధాగణ, లక్ష్మీభువనేశ్వరీ సహిత జ్ఞానసరస్వతీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అక్షర మంత్రం ప్రతిధ్వనించింది. వేలాది మంది పిల్లలతో తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు. పసుపుకొమ్ముతో ఓం నమఃశివాయ అని బియ్యంలో రాయించి అమ్మవారి అనుగ్రహం పొందారు. అనంతరం పలకలను నెత్తిన పెట్టుకుని ఆలయం చుట్టూ చిన్నారులు ప్రదక్షణ చేశారు. సాయంత్రం వేళ సూర్యప్రభ వాహనంపై అమ్మవారిని నగర వీధుల్లో ఊరేగింపుచేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. – విజయనగరం టౌన్