
లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి
ఇటీవల కాలంలో గుండెపోటు కేసుల్లో ఎక్కువగా 40 ఏళ్ల లోపు వారు ఉంటున్నారు. ధూమపానం, కొకై న్, డ్రగ్స్, ఖైనీ వంటివి తీసుకోవడం, ఆహారపు అలవాట్లు మారడం, వ్యాయమం లేకపోవడం, విపరీతమైన మానసిక ఒత్తిడి వంటి కారణాలతో గుండెపోటు వస్తుంది. రక్తంచిక్కగా ఉండడం వల్ల సడన్‌గా ఉండెపోటు వస్తుంది. గుండె పోటు లక్షణాలు ఏమాత్రం కనిపించినా వైద్యులను సంప్రదించాలి. పీచుపదార్థాలు ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. తాజా పండ్లు తినాలి.
డాక్టర్ జి.సూర్యప్రకాష్, కార్డియాలజిస్టు, విజయనగరం