
కోట దుర్గమ్మకు పంచలోహ కవచం వితరణ
కురుపాం: స్థానిక రావాడ జంక్షన్‌లో వెలసిన కోట దుర్గమ్మవారికి కీర్తిశేషులు నడుకూరు దుర్గ భవాని ప్రసాద్ దంపతుల కుమారుడు నడుకూరు దూళికేశ్వరరావు ఆదివారం అమ్మవారి విగ్రహానికి రూ.లక్షా ముప్ఫై వేల విలువైన పంచలోహ కవచం వితరణగా అందజేశారు. ఈ మేరకు ఆలయ అర్చకుడు శ్రీనివాస నాయక్, ఆలయ కమిటీ సభ్యులకు పంచలోహ కవచాన్ని అందజేసి అమ్మవారికి అలంకరించాలని కోరారు.
50 మందిపై తేనెటీగల దాడి
నెల్లిమర్ల రూరల్: మండలంలోని పారసాం గ్రామంలో తేనెటీగలు ఆదివారం బీభత్సం సృష్టించాయి. గ్రామ దేవతల ఉత్సవాల సందర్భంగా గ్రామస్తులు అమ్మవారి సన్నిధికి వెళ్లగా డీజే శబ్దాలకు స్థానిక శివాలయం వద్ద ఉన్న తేనె తుట్ట చెలరేగడంతో ఈగలు స్థానికులపై విచ్చలవిడిగా దాడి చేశాయి. దాడిి జరిగిన సమయంలో సుమారు 200 మంది ఉండగా వారిలో 50 మందిని తేనెటీగలు గాయపరిచాయి. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని కేంద్రాస్పత్రికి తరలించగా మిగిలిన వారికి కొండవెలగాడ పీహెచ్‌సీలో చికిత్స అందించారు. క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో పారసాం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
నేటి నుంచి రిలే నిరాహార దీక్షలు
● జిందాల్ నిర్వాసితుల నిర్ణయం
శృంగవరపుకోట: కంపెనీ ఏర్పాటు పేరుతో జిందాల్ తీసుకున్న తమ భూములు తమకే ఇవ్వాలని చేస్తున్న జిందాల్ నిర్వాసితుల దీక్షలు 100వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా నాలుగెకరాల భూమి కోల్పోయి నిరసన చేస్తున్న వందేళ్ల వృద్ధురాలు గొండ గద్దమను ఎమ్మెల్సీ రఘురాజు, ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ తదితరులు ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా ఒక్కో రోజు ఒక్కో గ్రామానికి చెందిన నిర్వాసితులు నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించారు. అనంతరం నిర్వాసితులు మాట్లాడుతూ ఇంత వరకూ తమ పోరాటాలతో అన్ని వర్గాల వారి అభిమానం సాధించుకున్నామని, మన పోరాటానికి ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన కరువైందని, నిద్దరోతున్న ప్రభుత్వాన్ని లేపడానికి నిరాహారదీక్షలు చేయాల్సి రావడం సిగ్గుచేటన్నారు. ఈ పోరాటంలో నిర్వాసితులతో చివరి వరకూ ఉండి, మద్దతిస్తామని రఘురాజు, జగన్‌లు తెలిపారు.

కోట దుర్గమ్మకు పంచలోహ కవచం వితరణ

కోట దుర్గమ్మకు పంచలోహ కవచం వితరణ