
ఉచిత గ్యాస్ దూరం..!
రాయితీ పడింది..
వేలాది మందికి
● మొదటి, రెండు విడతల్లో 25,834 మందికి పడని గ్యాస్ రాయితీ నగదు ● వీరికి అందాల్సిన రాయితీ రూ.2.13 కోట్లు ● మొదటి విడతలో 6,473 మందికి అందని రాయితీ ● రెండో విడతలో 19,261 మందికి అందని రాయితీ
వివిధ కారణాలతో కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ రాయితీని తగ్గించుకోవాలని చూస్తుందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ బిల్లు ఎక్కువగా వచ్చిందని కొందరికి, ఇంట్లో అంగన్‌వాడీ కార్యకర్త, ఆశ కార్యకర్త వంటి చిరుద్యోగులు ఉన్నారని మరికొందరికి ఇలా అనేక కారణాలతో లబ్ధిదారులకు అందించాల్సిన ఉచిత రాయితీ నగదును ప్రభుత్వం ఎగ్గొట్టందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
విజయనగరం ఫోర్ట్:
అధికారంలోకి రావడం కోసం కూటమి నేతలు గత సాధారణ ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని అనేక హామీలను గుప్పించారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ పేరుతో అలవకాని హామీ లు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. కూటమి సర్కార్ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఉచిత గ్యాస్ పథకం ఒకటి. ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం వల్ల వేలా ది మంది అర్హులు గ్యాస్ రాయితీకి దూరం అయ్యా రు. అర్హత ఉండి కూడా రాయితీ బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. ఎందుకు కాలేదో.. ఎవరిని అడిగినా చెప్పిన పరిస్థితి లేదు. తమకు తెలియదంటే తమకు తెలియదని తప్పించుకుంటున్నారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామని కూటమి సర్కార్ ఎన్నికల సమయంలో గొప్పగా ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఒక్క సిలిండర్‌తో సరి పెట్టేసింది. దీంతో మొదటి ఏడాది రెండు సిలిండర్లు లబ్ధిదారులకు అందలేదు.
ప్రభుత్వం గుర్తించిన లబ్ధిదారులు 5.02 లక్షలు
జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు ఆరు లక్షలకు పైగా ఉన్నా యి. వీరిలో ప్రభుత్వం అందించే ఉచిత గ్యాస్ కో సం ప్రభుత్వం గుర్తించిన లబ్ధిదారులు 5,02,654 మంది. మొదటి విడతలో 4,46,846 మంది గ్యాస్ తీసుకున్నారు. ఇందులో 4,40,373 మందికి మాత్ర మే గ్యాస్ రాయితీ నగదు వారి ఖాతాల్లో పడింది. 6,473 మందికి గ్యాస్ రాయితీ పడలేదు. రెండో విడతలో 4,36,690 మంది గ్యాస్ తీసుకోగా ఇందులో 4,17,329 మందికి మాత్రమే గ్యాస్ రాయితీ పడింది. 18,361 మందికి గ్యాస్ రాయితీ నగదు పడలేదు. రెండు విడతల్లో 25,834 మందికి గ్యాస్ రాయితీ పడలేదు. వీరికి రావాల్సిన గ్యాస్ రాయితీ మొత్తంగా రూ.2.13 కోట్లు.
మొదటి విడతలో..
జిల్లాలో మొదటి విడతలో భారత్ గ్యాస్ సిలిండర్లను 48,381 తీసుకోగా వీరిలో గ్యాస్ రాయితీ నగ దు 47,525 మంది లబ్ధిదారులకు జమ అయ్యింది. హెచ్‌పీ గ్యాస్ లబ్ధిదారులు 3,30,234 మంది గ్యాస్ తీసుకోగా వీరిలో 3,35,605 మందికి రాయితీ నగదు ఖాతాల్లో పడింది. ఇండియన్ గ్యాస్‌ను 68,231కిగాను గ్యాస్ రాయితీ 67,343 మంది లబ్ధిదారులకు జమ అయ్యింది.
రెండో విడతలో..
రెండో విడతకు సంబంధించి భారత్ గ్యాస్ తీసుకు న్న వారు 62,921 మంది కాగా ఇందులో 47,177 మందికి రాయితీ నగదు పడింది. హెచ్‌పీ గ్యాస్ లబ్ధిదారులు 3,17,626 మంది గ్యాస్‌ను విడిపించ గా వీరిలో 3,04,807 మందికి గ్యాస్ రాయితీ పడింది. ఇండియన్ గ్యాస్ సిలిండర్లను 66,143 మంది విడిపించగా.. వీరిలో 65,345 మందికి గ్యాస్ రాయితీ నగదు జమ అయ్యింది.
ఉచిత గ్యాస్ రాయితీకి సంబంధించి మొదట విడతలో 4,46,846 మంది గ్యాస్ తీసుకోగా 4,40,373 మందికి రాయితీ నగదు పడింది. రెండో విడతలో 4,36,690 మంది గ్యాస్ తీసుకోగా 4,17,329 మందికి గ్యాస్ రాయితీ పడింది.
– జి.మురళీనాధ్, జిల్లా పౌర సరఫరాల అధికారి

ఉచిత గ్యాస్ దూరం..!