సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

Sep 29 2025 11:12 AM | Updated on Sep 29 2025 11:12 AM

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన 11 వేదికల్లో విజయనగరం ఉత్సవాలు : కలెక్టర్‌ మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వమే నడిపించాలి బీసీ స్టడీ సర్కిల్‌ విద్యార్థులకు అభినందనలు

దత్తిరాజేరు : వచ్చే నెల అక్టోబర్‌ 1వ తేదీన పింఛన్ల పంపిణీకి ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తి గ్రామానికి రానున్న నేపథ్యంలో కలెక్టర్‌ రామ్‌సుందర్‌రెడ్డి ఏర్పాట్లను ఆదివారం పరిశీలించా రు. సీఎం హెలిపాడ్‌ దిగే స్థలాన్ని, సభా స్థలా న్ని అధికారులతో కలిసి పరిశీలించారు. గ్రా మంలో ఎక్కడ గోతులు లేకుండా చూడాలని, పరిశుభ్రంగా ఉంచాలని ఆయా శాఖల అధికా రులను ఆదేశించారు. ఆయన వెంట ఏపీడీపీఎల్‌ ఎస్‌ఈ లక్ష్మణరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ కవిత, బొబ్బిలి ఆర్డీవో మోహనరావు, పోలీసు శాఖ అధికారులు ఉన్నారు.

విజయనగరం అర్బన్‌: విజయనగరం ఉత్సవాలను 11 వేదికల్లో నిర్వహిస్తున్నామని ప్రతి వేదిక వద్ద ఘనంగా జరపాలని వేదికల ఇన్‌చా ర్జ్‌ అధికారులకు కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆది వారం ఉత్సవ వేదికల ఇన్‌చార్జ్‌ అధికారులతో ఏర్పాట్లపై వేదికల వారీగా సమీక్షించారు. ఉత్సవాల పనిపై దృష్టి పెట్టాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని తెలిపారు. లైఫ్‌ సభ్యులతో మాట్లాడుకొని ఉత్సవ ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని అన్నారు. ఉత్సవాల నిర్వహణలో వేదికల ఇన్‌చార్జ్‌లే బాధ్యత వహించాలని, ఎక్కడ లోపం జరిగిన ఆ వేదిక ఇన్‌చార్జ్‌నే బాధ్యత చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఏదైనా సమస్య ఉంటే వెంటనే జేసీ దృష్టిలో పెట్టి పరిష్కరించుకోవాలని సూచించారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్‌ సేతుమాధవన్‌, డీఆర్‌వో శ్రీనివాసమూ ర్తి, ఆర్‌డీవోలు, వేదికల ఇన్‌చార్జ్‌ అధికారులు, ముఖ్యమంత్రి పర్యటనలో డ్యూటీ వేసిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

విజయనగరం టౌన్‌: రాష్ట్రంలో పీపీపీ విధానాన్ని రద్దు చేసి అన్ని మెడికల్‌ కళాశాలలను ప్రభుత్వమే నడిపించాలని ఏఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు రెడ్డి నారాయణరావు, ఎన్‌.అప్పలరాజురెడ్డి డిమాండ్‌ చేశారు. ఏఐఎఫ్‌టీయూ న్యూ ఆధ్వర్యంలో ఆదివారం గాంధీ పార్కు నుంచి గంటస్తంభం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పది ప్రభుత్వ కళాశాలలను లీజుకిచ్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, జీవో నంబరు 107, 108లను రద్దు చేసి 100శాతం ఎంబీబీఎస్‌ సీట్లను ప్రభుత్వ కోటాలో భర్తీ చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యసేవలను ప్రభుత్వమే అందుబాటులోకి తీసుకురావాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో గుజ్జూరు శంకరరావు, గోవింద్‌, త్రినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

విజయనగరం టౌన్‌: బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా అందించిన శిక్షణను సద్వినియోగం చేసుకుని డీఎస్సీలో 19మంది అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయడం ఆనందంగా ఉందని బీసీ వెల్ఫేర్‌ అధికారిణి జ్యోతిశ్రీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం కార్యాలయం ఆవరణలో డీఎస్సీకి ఎంపికై న అభ్యర్థులను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురజాడ అప్పారావు బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా జిల్లాలో మొత్తం 228 మంది అభ్యర్థులకు కస్పా హైస్కూల్‌ ప్రాంగణంలో ప్రభుత్వం డీఎస్సీ శిక్షణ ఏర్పాటు చేసిందన్నారు. వీరికి ఉచితంగా 60 రోజుల పాటూ శిక్షణతో పాటు స్టైఫండ్‌, స్టడీ మెటిరియల్‌ కొనుగోలు చేసేందుకు నగదును అందించి ప్రోత్సహించిందన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకున్న 19 మంది అభ్యర్థులు మెగా డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. వీరిలో కొందరు తమ ప్రాథమిక విద్యను బీసీ హాస్టల్స్‌లో ఉంటూ పూర్తి చేశారన్నారు. కార్యక్రమంలో బీసీ వెల్పేర్‌ శాఖాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement