
యూపీహెచ్‌సీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
విజయనగరం ఫోర్ట్: పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల (యూపీహెచ్‌సీ) ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని ఆ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు జి.అప్పలసూరి డిమాండ్ చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూపీహెచ్‌సీ ఉద్యోగులు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద, మధ్య తరగతి ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌లో సమస్యలు పరిష్కరించకుండా చిరు ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. సమావేశంలో సంఘం నాయకులుల బాలరాజు, శంకర్, సుమిత్ర, హరికృష్ణ, మురళీమోహన్, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.