
ధ్వంసం చేసిన పంట పరిశీలన
పార్వతీపురం రూరల్: నాలుగు రోజుల క్రితం ప్రవేశించిన ఏనుగుల గుంపు పార్వతీపురం మండలంలోని చినమరికి, పెదమరికి, బండిదొరవలస తదితర గ్రామాలకు సంబంధించిన వ్యవసాయ భూముల్లో పంటలను ధ్వంసం చేస్తున్నాయి. పగలంతా సమీపంలో గల చెరువులు, తోటల్లో తిష్ఠవేస్తున్న ఏనుగుల గుంపు రాత్రి అయితే బండిదొరవలస సమీపంలో రహదారి పక్కనున్న మొక్కజొన్న పంట పొలంలో సేదదీరుతూ పంటను నాశనం చేస్తున్నాయి. అయితే గురువారం, శుక్రవారం డొల్లు పారినాయుడుతో పాటు మరికొంతమంది రైతులకు చెందిన మొక్కజొన్న పంటలను ఏనుగులు ధ్వంసం చేసిన నేపథ్యంలో మండల వ్యవసాయశాఖాధికారి అశోక్ నేరుగా గ్రామానికి వెళ్లి పరిశీలించారు. ఈ మేరకు బాధిత రైతులతో మాట్లాడి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని రైతులకు తెలిపారు.