పంట చేతికొచ్చినా.. అమ్ముకునే దారిలేక... | - | Sakshi
Sakshi News home page

పంట చేతికొచ్చినా.. అమ్ముకునే దారిలేక...

Sep 28 2025 6:49 AM | Updated on Sep 28 2025 6:49 AM

పంట చ

పంట చేతికొచ్చినా.. అమ్ముకునే దారిలేక...

రామభద్రపురం:

రుగాలం శ్రమించి సాగుచేసిన మొక్కజొ న్న పంట చేతికొచ్చింది. నూర్పిడి పనులు చేపట్టారు. అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాల జాడ కనిపించడం లేదు. దళారులు క్వింటాకు రూ. 300 తక్కువకు అడుగుతున్నారు. ఏం చేయాలో తెలియక... పంటకు చేసిన అప్పులు తీర్చేదారిలేక రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట చేతికొచ్చేవేళ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు. రైతులపై సీఎం చంద్రబాబుకు ఇంత వివక్షతగదని వాపోతున్నారు. వరి సాగుచేసే రైతులకు యూరియా లభించడం లేదు. పంటలకు గిట్టుబాటు ధరలు లేవు.. ఇప్పుడు మొక్కజొన్న చేతికొచ్చినా కొనుగోలు చేసేవారు కనిపించడంలేదు.. ఇలా అయితే రైతు బతికేది ఎలా ‘బాబూ’ అంటూ ప్రశ్నిస్తున్నారు.

కొనుగోలు చేసేది ఎప్పుడు?

జిల్లాలోని 27 మండలాల్లో సుమారు 9,850 హెక్టార్లలో మొక్కజొన్న పంటను రైతులు సాగుచేశారు. ఎకరాకు దాదాపు రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టారు. కేంద్ర ప్రభుత్వం క్వింటా మొక్కజొన్నలు రూ.2,400లుగా మద్ధతు ధర ప్రకటించింది. నేటికీ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కాకపోవడంతో నూర్పిడిచేసిన పంటను కళ్లాల్లోనే ఉంచి రైతులు కాపాలాకాస్తున్నారు. ఓ వైపు వర్షాలతో పంట రక్షణకు నానా పాట్లు పడుతున్నారు. వ్యాపారులకు విక్రయిద్దామంటే క్వింటాను రూ.2వేల నుంచి రూ.2,100 మధ్య కొనుగోలు చేస్తున్నారు. క్వింటా వద్ద రూ.300 ధర కోల్పోతున్నారు. పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చేందుకు కొందరు రైతులు తక్కువ ధరకే వ్యాపారులకు విక్రయిస్తున్నారు.

రైతంటే చిన్నచూపు తగదు

రైతులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. మొక్కజొన్న పంట చేతికొచ్చినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడం దారుణం. నూర్పిడి చేసిన పంటను రక్షించేందుకు నానా పాట్లు పడుతున్నాం. వర్షాల నేపథ్యంలో కళ్లాల్లో మొక్కజొన్న గింజలను ప్రతిరోజూ ఆరబెడుతున్నాం. – పొట్టంగి రాము,

రైతు, పారాది, బొబ్బిలి మండలం

గిట్టుబాటు ధర కల్పించాలి

కష్టపడి పండించిన పంటకు ప్రభుత్వం రూ.3 వేల గిట్టుబాటు ధర కల్పించాలి. కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి. పంట నిల్వ ఉంచుకోలేక కొందరు రైతులు తక్కువ ధరకు వ్యాపారులకు విక్రయిస్తున్నారు.

– పూడి సత్యం, రైతు, రామభద్రపురం

ఉత్తర్వులు రాలేదు..

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ఇంకా ఉత్తర్వులు రాలేదు. కొన్ని ప్రాంతాలలో నూర్పిడి చేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో పంట కోతకు సిద్ధంగా ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంట కొనుగోలుకు చర్యలు తీసుకుంటాం. రైతులు ఆందోళన, తొందరపడాల్సిన అవసరం లేదు. – వెంకటేశ్వరరావు,

మార్క్‌ఫెడ్‌ జిల్లా మెనేజర్‌, విజయనగరం

పంట చేతికొచ్చినా.. అమ్ముకునే దారిలేక... 1
1/4

పంట చేతికొచ్చినా.. అమ్ముకునే దారిలేక...

పంట చేతికొచ్చినా.. అమ్ముకునే దారిలేక... 2
2/4

పంట చేతికొచ్చినా.. అమ్ముకునే దారిలేక...

పంట చేతికొచ్చినా.. అమ్ముకునే దారిలేక... 3
3/4

పంట చేతికొచ్చినా.. అమ్ముకునే దారిలేక...

పంట చేతికొచ్చినా.. అమ్ముకునే దారిలేక... 4
4/4

పంట చేతికొచ్చినా.. అమ్ముకునే దారిలేక...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement