
యూరియా కష్టాలు చూడండి ‘బాబూ’..
కెల్ల సచివాలయం వద్ద యూరియా కోసం రైతుల క్యూ
గుర్ల/రేగిడి: వర్షాలు కురుస్తుండడంతో వర్షాధార పంట పొలాల్లో నీరు చేరింది... కాస్త యూరియా వేస్తే వరిపైరు ఏపుగా పెరుగుతుందని ఆశించిన రైతన్నకు ఎరువు దొరకడం లేదు. ఆర్‌ఎస్‌కేలు, ప్రైవేటు దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. గుర్ల మండలంలోని కెల్ల ఆర్‌ఎస్‌కే వద్ద శనివారం సుమారు 2వేల మంది రైతులు క్యూ కట్టారు. కేవలం 450 బస్తాలు మాత్రమే రావడం, ఇందులో కూటమి నేతలకోసం యూరియా బస్తాలను పక్కకు తీయడంతో రైతులు ఆందో ళన చెందారు. ఈ క్రమంలో టోకెన్ల కోసం తోపులాట జరిగింది. ఇందులో కెల్ల గ్రామానికి చెందిన మహిళా రైతు జె.మంగ సొమ్మసిల్లి పడిపోవడంతో స్థానిక ప్రైవేటు క్లినిక్‌కు తరలించి చికిత్స అందజేశారు.
● రేగిడి మండలం కొర్లవలస ఆర్‌ఎస్‌కే వద్ద బస్తా యూరియా కోసం రైతులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. తహసీల్దార్ ఐ.కృష్ణలత, ఎస్‌ఐ బాలకృష్ణ, ఏఓ బి.శ్రీనివాసరావు సమక్షంలో యూరియా పంపిణీ చేశారు.

యూరియా కష్టాలు చూడండి ‘బాబూ’..

యూరియా కష్టాలు చూడండి ‘బాబూ’..