
నవదుర్గ ఆలయంలో చోరీ
పార్వతీపురం రూరల్: మండలంలోని పెదబొండపల్లి గ్రామంలో గల శ్రీ నవదుర్గ మాత ఆలయంలో గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగలు ఆలయ హుండీలో భక్తులు సమర్పించిన చిల్లర నాణాలను దోచుకెళ్లినట్లు ఆలయ ధర్మకర్త ఎన్.రాజ్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రూరల్ ఎస్సై బి.సంతోషికుమారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై వివరాలు వెల్లడిస్తూ గురువారం హుండీలో లెక్కించిన చిల్లర డబ్బులు ఆలయంలో ఉన్న ట్రంకుపెట్టెలో భద్రపరచగా గుర్తుతెలియని దుండగులు రూ.1000లు చోరీ చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం ఆలయం తలుపులు తెరిచేందుకు వచ్చిన ధర్మకర్త రాజ్యలక్ష్మి చోరీ జరిగినట్లు గుర్తించి తమకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంతోషికుమారి తెలిపారు.