
క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారుల పర్యటన
విజయనగరంఫోర్ట్: వరిపంటకు తెగుళ్లు అశించడంతో రైతులకు సూచనలు, సలహాలు అందించేవారు లేక అవస్థలు పడుతున్న అంశంపై సాక్షిలో శుక్రవారం ‘వరిపంటపై తెగుళ్ల దాడి’ వార్తకు వ్యవసాయ అధికారులు స్పందించారు. ఈ మేరకు విజయనగరం మండలంలో మండల వ్యవసాయ అధికారి ఎ.శ్రీనివాస్, వీఏఏ శోభలు రాకోడు, పినవేమలి, కోరుకొండ గ్రామాల్లో పర్యటించి వరి పంటకు అశించిన తెగుళ్లను గుర్తించి వాటినివారణ చర్యల గురించి రైతులకు వివరించారు. గంట్యాడ మండలంలోని పెదవేమలి గ్రామంలో వీఏఏ రమేష్ రైతుల పొలాలను పరిశీలించి తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు.
మూడవ లైన్‌లో స్పీడ్ ట్రయల్ రన్
పార్వతీపురం టౌన్/బొబ్బిలి: పార్వతీపురం–డొంకినవలస మధ్య కొత్తగా వేసిన రైల్వే మూడవ లైన్‌లో స్పీడ్ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయిందని రైల్వే సేఫ్టీ కమిషనర్ బ్రిజేష్ కుమార్ మిశ్రా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురం రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన ట్రయల్ రన్, అమృత భారత్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది వాల్తేరు డివిజన్‌కు మరో మైలురాయిగా, ఈ ప్రాంతంలో రైలు మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుందన్నారు. డొంకినవలస, బొబ్బిలి, సీతానగరం, పార్వతీపురం స్టేషన్లను కలిపేందుకు 36 కిలోమీటర్లలో కొత్తగా నిర్మించిన, విద్యుదీకరించిన మూడవ లైన్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత స్పీడ్ ట్రయల్ రన్‌ను పర్యవేక్షించినట్లు తెలిపారు. రాయగడ–విజయనగరం మార్గం డబ్లింగ్‌లో భాగంగా ఉందన్నారు. డివిజన్‌లోని నిర్మాణం, ఇతర శాఖల మధ్య ప్రమేయం ఉన్న అన్ని విభాగాల అంకితభావాన్ని, సమర్థవంతమైన సమన్వయాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. అనంతరం అధికారులు స్టేషనన్‌యార్డ్ క్రాస్ ఓవర్లు, హైలెవల్ ప్లాట్‌ఫామ్‌లు, వంతెనలతో పాటు కొత్తగా అందించిన సౌకర్యాలపై సమీక్షించారు. కార్యక్రమంలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (కన్‌స్ట్రక్షన్) అంకుష్ గుప్తా, చీఫ్ బ్రిడ్జి ఇంజినీర్ అశోక్ కుమార్, ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.కె.పాత్రో, వాల్తేరు డివిజన్ నుంచి సివిల్ ఇంజినీరింగ్, సిగ్నల్– టెలికాం, ఎలక్ట్రికల్, ట్రాఫిక్ విభాగాల నుంచి ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
వృద్ధుడిని రోడ్డుపై వదిలేసిన కుటుంబం
● ఆదుకున్న టూటౌన్ పోలీసులు
● నైట్ షెల్టర్‌లో ఆశ్రయం
అల్లిపురం (విశాఖ): రోజురోజుకీ మానవత్వ విలువలు పడిపోతున్నాయనడానికి ఈ సంఘటనే నిదర్శనం. వృద్ధులను అంతిమ దశలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుటుంబసభ్యులు వారిని బరువుగా భావిస్తున్న దుస్థితి కనిపిస్తోంది. ఆస్తులు కావాలి గానీ, కన్నవారు అవసరం లేదా అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం సాయంత్రం విజయనగరం నుంచి సుమారు 75 ఏళ్ల వృద్ధుడిని రైల్వే స్టేషన్ దరి సిగ్నల్ పాయింట్ సమీపంలో ఒక ఆటోలో తీసుకువచ్చి వదిలివెళ్లి పోయారు. ఆయనకు యూరి నల్ బ్యాగు తగిలించి, డైపర్ వేసి ఉంది. వృద్ధుడి పరిస్థితిని చూసిన సమీపంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్, వెంటనే టూటౌన్ బ్లూకోల్ట్ కానిస్టేబుల్ నారాయణకు సమాచారం అందించారు. నారాయణ అక్కడికి వెళ్లి, ఆ వృద్ధుడి దుస్థితి చూసి చలించిపోయారు. అనంతరం రక్షక్‌కు ఫోన్ చేసి, విషయాన్ని టూటౌన్ సీఐ వీవీసీఎం ఎర్రంనాయుడుకు తెలియజేశారు. ఆయన ఆదేశాల మేరకు వృద్ధుడిని భీమ్‌నగర్ నిరాశ్రయ వసతి గృహానికి తరలించి, ఆశ్రయం కల్పించారు. వృద్ధుడు తనది విజయనగరం అని మాత్రమే చెప్పగలుగుతున్నాడని, పోలీసులు తెలిపారు. వృద్ధుడి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని, వారికి కౌన్సెలింగ్ చేసి, మరొకరు ఇలాంటి పనులు చేయకుండా తగిన విధంగా బుద్ధి చెప్పాలని పలువురు కోరుతున్నారు.

క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారుల పర్యటన

క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారుల పర్యటన