
పండగ పూట పస్తులుండాలా?
● కలెక్టరేట్ వద్ద పారిశుద్ధ్యకార్మికులు,
వాచ్‌మెన్ల ఆందోళన
విజయనగరం గంటస్తంభం: వచ్చేది దసరా.. వీధులన్నీ దీపాలతో వెలిగిపోతుంటే.. మా ఇళ్లు మాత్రం చీకటిలో మగ్గిపోతున్నాయని, మూడు నెలలుగా జీతాలు అందక పోయినా పట్టించుకునేవారే లేరంటూ పాఠశాలలు, కళాశాల పారిశుద్ధ్య కార్మికులు, వాచ్‌మెన్లు ఆవేదన వ్యక్తంచేశారు. సీఐటీయూ ఆధ్వర్వంలో విజయనగరం కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఆందోళన చేశారు. అనంతరం డీఈఓ మాణిక్యంనాయుడుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయు నాయకులు బి.సుధారాణి, ఏ.జగన్మోహనరావు మాట్లాడుతూ ప్రతి నెలా 10వ తేదీలోపు జీతాలు చెల్లించాలని, కనీస వేతనం రూ.12 వేలకు పెంచాలని, గుర్తింపు కార్డులు, యూ నిఫాంలు, పనిముట్లు అందజేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో యూనియన్ అధ్యక్షురాలు, కార్యదర్మి ఎస్.కె.బేగం, నందిని, నాయకులు ఉమా, సరస్వతి, స్వాతి, లక్ష్మి, రమణమ్మ, సావిత్రి, ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.