
క్రీడల్లో రాణించి.. ఉద్యోగం సాధించి
–10లో
నేరగాళ్లపై ఉక్కుపాదం మోపండి
నేరాల నియంత్రణతో పాటు నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలని ఎస్‌వీ మాధవ్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు.
చీపురుపల్లి రూరల్ (గరివిడి):
పట్టుదలతో సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు. ఆసక్తి ఉన్న రంగంలో రాణించి భవితకు బంగారుబాట వేసుకోవచ్చని నిరూపించింది గరివిడి మండలం కొండలక్ష్మీపురం గ్రామానికి చెందిన రెడ్డి మౌనిక. ఆటల్లో మేటిగా నిలిచి ఉన్నతోద్యోగం సాధించింది. ఆమెది వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు సత్తిబాబు, పార్వతి వ్యవసాయం చేస్తూనే కుమారుడు భానుప్రసాద్‌తో పాటు మౌనికను డిగ్రీ వరకు చదివించారు. కొండలక్ష్మీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న సమయంలో మౌనిక టెన్నీకాయిట్ క్రీడలో ఆసక్తి చూపేది. ఆమెలో ఉన్న పట్టుదల, ప్రతిభను గుర్తించిన పీడీ ఎం.రామారావు టెన్నీకా యిట్‌లో తర్ఫీదు ఇచ్చారు. మెలకువలు నేర్పారు. పతకాలు సాధించేలా సాధన చేయిస్తూ ప్రోత్సహించారు. అంతే.. స్కూల్ గేమ్స్‌లో ఆరంభమైన ఆమె విజయకేతనం అంతర్జాతీయ వేదికలపై బంగారు పతకాల పంటపండిస్తోంది. రెండు నెలల కిందట క్రీడా కోటాలో ఇన్‌కమ్‌ట్యాక్స్ విభాగంలో జీఎస్టీ హవల్దార్ ఉద్యోగానికి ఎంపిక కావడంతో తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. గ్రామస్తులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.
టెన్నీకాయిట్‌లో మౌనిక రాణింపు
గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో పతకాల సాధన
స్పోర్ట్స్ కోటాలో ఇన్‌కమ్ ట్యాక్స్
విభాగంలో ఉద్యోగం
మౌనిక క్రీడా విజయం ఇలా..
స్కూల్ గేమ్స్ టెన్నీకాయిట్ పోటీల్లో జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక.
2017లో అనంతపురం జిల్లా కదిరి మండలంలో జరిగిన సబ్‌జూనియర్స్ చాంపియన్‌షిప్ స్టేట్ మీట్‌లో రాణించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత. వెస్ట్‌బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధన.
సౌత్ ఆఫ్రికాలో 2023 సెప్టెంబర్ నెలలో జరిగిన అంతర్జాతీయ టెన్నీకాయిట్ పోటీల్లో బంగారు పతకం సొంతం.
స్పోర్ట్స్ కోటాలో విశాఖపట్నం పోర్టులో జీఎస్టీ విభాగంలో హవల్దార్‌గా ఉద్యోగం.

క్రీడల్లో రాణించి.. ఉద్యోగం సాధించి

క్రీడల్లో రాణించి.. ఉద్యోగం సాధించి