విజయనగరం/నెల్లిమర్ల: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎమ్మెల్సీలు పెనుమత్స సురేష్‌బాబు, పాలవసల విక్రాంత్, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరిసహస్ర గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పలు రాజకీయ అంశాలపై చర్చించారు. సిరిసహస్ర తన సంస్థ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు.
పైడితల్లి జాతరకు పటిష్ట బందోబస్తు
● విశాఖ పోలీస్ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి
విజయనగరం క్రైమ్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి సిరిమానోత్సవం ప్రశాంతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. వచ్చేనెల 6, 7 తేదీల్లో జరగనున్న పైడితల్లి తొలేళ్లు, సిరిమానోత్సవాల్లో భాగంగా బందోబస్తు ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. సిరిమాను తిరిగే ప్రధాన రోడ్లను ఎస్పీ దామోదర్, డీఎస్పీ గోవిందరావుతో కలిసి పరిశీలించారు. హుకుంపేట నుంచి కన్యకాపరమేశ్వరి టెంపుల్, గంటస్తంభం, మూడులాంతర్లు కూడలిలో పర్యటించారు. అనంతరం మూడులాంతర్లు కూడలి వద్ద స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జాతర బందోబస్తుకు విశాఖ నుంచి సిబ్బందిని నియమిస్తామన్నారు.
ఉగ్రవాద భావజాలంతో నగరానికి చెందిన సిరాజ్ అరెస్టు నేపథ్యంలో జాతరలో ఇలాంటి అల్లర్లు జరగకుండా పోలీస్‌శాఖ చర్యలు తీసుకుంటోందన్నారు. నగరంలోని పలు ప్రాంతాలను స్పెషల్ బ్రాంచ్, ఇంటిలిజెన్స్ శాఖలు జల్లెడపడుతున్నట్టు వెల్లడించారు. అనంతరం విజయనగరం రూరల్, మహిళా పోలీస్ స్టేషన్లను వార్షిక తనిఖీలలో భాగంగా సందర్శించారు. ఆయన వెంట సీఐలు ఆర్వీకే చౌదరి, శ్రీనివాస్, లక్ష్మణరావు, ట్రాఫిక్ సీఐ సూరినాయుడు, ఎస్‌ఐలు రవి, లక్ష్మీ ప్రసన్నకుమార్, కృష్ణమూర్తి, మురళి, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
పంట పొలాల్లో గజరాజులు
పార్వతీపురం రూరల్: దాదాపు 11 నెలల విరామం తరువాత ఏనుగుల గుంపు పార్వతీపురం మండలంలోకి బుధవారం రాత్రి ప్రవేశించింది. బండిదొరవలస, పెదమరికి, చినమరికి గ్రామాల సమీపంలోని పంటపొలాల్లో సంచరించింది. వరి, మొక్కజొన్న, అరటి, రాగులు, కూరగాయలు పంటలను నాశనం చేస్తుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మజ్జి శ్రీనివాసరావు, సిరి సహస్ర

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్‌బాబు

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్