
జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాకు పతకాలు
విజయనగరం: జాతీయ స్థాయిలో జరిగిన సౌత్‌జోన్ జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు గుంటూరు జిల్లాలోని ఆచార్యనాగార్జున యూనివర్సిటీలో జరిగిన పోటీల్లో 8 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించగా,, ముగ్గురు క్రీడాకారులు నాలుగు పతకాలు దక్కించుకున్నారు. పోటీల్లో పి.వసంత 200 మీటర్ల పరుగు పోటీలో కాంస్య పతకం, 400 మీటర్ల రిలే పరుగు పోటీలో మరో కాంస్య పతకం కై వసం చేసుకుంది. అలాగే క్రీడాకారిణి దివ్య 400 మీటర్ల రిలే పరుగు పోటీలో కాంస్య పతకం దక్కించుకోగా.. ఎం.హరీష్ 3000 మీటర్ల పరుగు పోటీల్లో కాంస్య పతకం సాధించాడు. సౌత్‌జోన్ పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులతో పాటు వారికి శిక్షణ ఇచ్చిన కోచ్‌లు సతీష్, మధు, శేఖర్‌లకు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.లీలాకృష్ణ, జి.శ్రీకాంత్, కోశాధికారి ఆనంద్ కిషోర్‌లు అభినందించారు.

జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాకు పతకాలు