
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు సహకరించాలి
పార్వతీపురం రూరల్: జిల్లాలో ఓటర్లకు సౌకర్యవంతంగా ఉండేలా పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు రాజకీయ పార్టీలు సహకరించాలని డీఆర్‌ఓ కె.హేమలత కోరారు. ఈ మేరకు గురువారం ఆమె తన చాంబర్‌లో గుర్తింపు ఉన్న కొన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేందంరం ఓటర్ల నివాసాలకు 2కి.మీ పరిధిలో, 800 నుంచి 1200మంది ఓటర్లు ఉండేలా ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఈ మేరకు ఎక్కడైనా మార్పులు, చేర్పులు అవసరమని గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని పార్టీల ప్రతినిధులకు ఆమె సూచించారు. అదేవిధంగా పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీలో పార్టీల ప్రతినిధుల భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు బూత్‌లెవెల్ ఏజెంట్‌ను నియమించాలని వారు బూత్‌లెవెల్ అధికారులతో కలిసి పనిచేసి ఓటరు జాబితాలోని తప్పులు సరిదిద్దడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. సమావేశంలో వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
డీఆర్‌ఓ కె.హేమలత