
నిర్వాసితుల సమస్యపై ఎమ్మెల్యే మాట్లాడాలి
లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్ శ్రీ135 శ్రీ240 శ్రీ250
చికెన్
శృంగవరపుకోట: జిందాల్ నిర్వాసితుల సమస్యలను స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అసెంబ్లీ వేదికగా ప్రస్తావించాలని, ప్రభుత్వానికి తమ గోడు వినిపించాలని, గురువారం నాటి నిరసన కార్యక్రమంలో నిర్వాసితులు డిమాండ్ చేశారు. జిందాల్ యాజమాన్యం అక్రమంగా తమ భూముల్లో ప్రవేశించి యేళ్ల వయస్సున్న చెట్లు కొట్టించిందని, అన్యాయంగా భూములు ఆక్రమించి, అక్రమ కేసులు పెట్టి బెదిరించారని, పోలీసుల నిర్బంధంలో నిర్వాసితులను ఉంచి, గొంతు నొక్కేశారని వాపోయారు. జిందాల్ గతంలో ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయకుండా, భూములు ఇచ్చిన రైతులను రోడ్డున నెట్టారన్న నిజాలను అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రస్తావించాలని నిర్వాసితులు కోరారు.