
రోగుల పట్ల చిరాకుపడకూడదు
జిల్లా ఆస్పత్రికి, బోధనాస్పత్రికి రోగులు ప్రతిరోజూ వేలాది మంది వస్తారు. అయితే తొందరగా వెళ్లి పోవాలనే అలచోనతో వారు మందులు త్వరగా ఇవ్వాలని అడుగుతుంటారు. అటువంటి వారి పట్ల చిరాకు పడడం, విసుక్కోవడం చేయకూడదు. ఓపిగ్గా వారికి మందులు అందించి అవి ఏవిధంగా వాడాలో చెప్పాలి. వృద్ధులు, దివ్యాంగులకు త్వరగా మందులు అందించాలి. ఫార్మసిస్టులు ఆరోగ్య రంగంలో మూలస్తంభం లాంటి వారు. మందులు అందించడం ద్వారా ప్రజలకు సేవ చేసే అదృష్టాన్ని భగవంతుడు తమకు ఇచ్చిన వరంగా ప్రతి ఫార్మసిస్టు భావించాలి. బమ్మిడి నరసింగరావు,
ఫార్మసీ ఆఫీసర్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి
మందులు ఇచ్చేటప్పుడు
అప్రమత్తంగా ఉండాలి
వైద్యులు సూచించిన మందులు రోగులకు అందించేటప్పడు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. మందుల కాలపరిమితి, బ్యాచ్ నంబర్ చూసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ కాలం చెల్లిన, రంగు మారిన మందులు రోగులకు అందించకూడదు. రోగులు మందులు ఏవిధంగా , ఏసమయంలో వేసుకోవాలో కౌన్సెలింగ్ నిర్వహించి మందులు అందజేయాలి. బైలపూడిసన్యాసినాయుడు,
రాష్ట్ర ఫార్మసిస్టుల సంఘం ఉపాధ్యక్షుడు

రోగుల పట్ల చిరాకుపడకూడదు