
సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో ఘనంగా వరల్డ్ టూరిజం డ
విజయనగరం అర్బన్: కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలోని టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం వరల్డ్ టూరిజం డే–2025 ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పర్యాటక రంగం సుస్థిరత, సృజనాత్మకత, సాంస్కృతిక మార్పిడి రంగాల్లో పోషించే కీలక పాత్రను ఈ వేడుకలు ప్రతిబించించాయి. రెండురోజుల పాటు జరిగిన కార్యక్రమాల్లో సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ ఫ్లో సైకిల్ రేస్, పోస్టర్ పోటీ, వేస్ట్ టు వండర్స్ వంటి వినూత్న పోటీలు విద్యార్థులకు నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ రిజస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్ర మోహన్ మిశ్రా మాట్లాడుతూ భవిష్యత్తు నిపుణులను సుస్థిర దృక్పథంతో తీర్చిదిద్దడం ద్వారా పర్యాటక రంగం మరింత బలోపేతం అవుతుందన్నారు. అనంతరం వినూ త్న పోటీల విజేతలకు జ్ఞాపికలు, బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో బోధన సిబ్బంది ప్రతాప్ కేశరి దాస్, డాక్టర్ అప్పాసాబా, డాక్టర్ కుసుమ్, డాక్టర్ గంగునాయుడు మండల, యూనివర్సిటీ లైబ్రేరియన్ డాక్టర్ శంకర్ రెడ్డి కోలే, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.