సంతకవిటి: మండలంలోని సిరిపురం పంచాయతీ బలరాంపేట గ్రామానికి చెందిన బోర వెంకటలక్ష్మి గుంటూరులో జరగనున్న జాతీయ స్థాయి సౌత్‌జోన్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై ంది. ఈమె గత నెలలో ప్రకాశం జిల్లా చీరాలలోజరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని 3 కిలోమీటర్ల రన్నింగ్‌లో ద్వితీయ స్థానం సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది.
డీఐజీని కలిసిన ఎస్పీ
విజయనగరం క్రైమ్: విశాఖ రేంజ్ డీఐజీని ఎస్పీ ఎఆర్ దామోదర్ బుధవారం రేంజ్ కార్యాలయంలో కలిశారు. డీఐజీని కలిసిన ఎస్పీ దామోదర్ మర్యాదపూర్వకంగా పూలమొక్కను ఈ సందర్భంగా అందజేశారు. ఎస్పీగా చార్జ్ తీసుకున్న దామోదర్‌కు డీఐజీ గోపీనాథ్ జెట్టి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా నివారణ, సైబర్‌నేరాలు అరికట్టడంపై దృష్టి పెట్టాలని, వాటిపట్ల ప్రజలను అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే రహదారి ప్రమాదాలపట్ల ప్రయాణికులను అప్రమత్తం చేసేలా చైతన్యకార్యక్రమాలు చేపట్టాలని ఎస్పీకి డీఐజీ స్పష్టం చేశారు.
విజయనగరం అర్బన్: జేఎన్‌టీయూ జీవీ ఇంజినీరింగ్ కళాశాల మెటలర్జికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన రీసెర్చ్ స్కాలర్ కొత్తపల్లి వెంకటేష్‌కు పీహెచ్‌డీ డిగ్రీ లభించింది. ప్రొఫెసర్ జి.స్వామినాయుడు పర్యవేక్షణలో ఆయన పరిశోధన పూర్తి చేశారు. వెంకటేష్ చేసిన పరిశోధనలో అభివృద్ధి చేసిన మెటీరియల్ అధిక బలం, తుప్పు నిరోధకత, ఘర్షణ నిరోధకత కలిగి ఉండడంలో వైమానిక, నౌకాదళ, రక్షణ రంగాల్లో వినియోగానికి దోహదపడనుందని నిపుణులు తెలిపారు. వర్సిటీ నుంచి పీహెచ్‌డీ పొందిన మొట్టమొదటి ఫుల్‌టైమ్ రీసెర్చ్ స్కాలర్‌గా వెంకటేష్ పేరు నమోదైనట్టు స్వామినాయుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. వెంకటేష్‌ను ఎన్‌ఐటీ నాగపూర్ ప్రొఫెసర్ డి.రవికుమార్, పలువురు ప్రొఫెసర్లు అభినందించారు.
భర్త ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: ఆ దంపతులకు పైళ్లె నాలుగేళ్లయింది. భార్యలో లోపమో భర్తలో లోపమో తెలియదు కానీ వారికి సంతానం కలగలేదు. డాక్టర్‌కు చూపిద్దామనుకున్న సమయంలోనే భర్త నాగరాజు మద్యానికి బానిసయ్యాడు. రోజూ ఇంటికి ఆలస్యంగా రావడం అదే పనిగా మద్యం తాగి వస్తుండడంతో విసిగిపోయిన భార్య భర్తను విడిచిపెట్టి కన్నవారింటికి వచ్చి ఉంటోంది. దీంతో మానసిక వేదనకు గురైన భర్త నాగరాజు విజయనగరంలోని గాజులరేగ రైలు పట్టాల వద్ద పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అంతకుముందే తన స్నేహితుడికి ఫోన్ చేసి ఇంట్లో బాధ మొత్తం చెప్పాడు. వెంటనే ఘటనా స్థలికి స్నేహితుడు వచ్చి నాగరాజును హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. భార్య వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు వెంకటలక్ష్మి
జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు వెంకటలక్ష్మి
జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు వెంకటలక్ష్మి