
● మేము ఏం తప్పుచేశాం..
మెరకముడిదాం మండలం బుధరాయవలస గ్రామానికి చెందిన నీలాపు సత్యనారాయణ ముగ్గురు పిల్లలు సాయి, గణేష్, హైమావతి గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదుతున్నారు. సత్యనారాయణ భార్య చిన్నమ్మలు 2021లో మృతి చెందింది. అప్పటి నుంచి కూలీనాలీ చేసి పిల్లలను సాకుతున్నానని, ముగ్గురు పిల్లలకు తల్లికి వందనం డబ్బులు అందలేదంటూ సత్యనారాయణ వాపోతున్నాడు. హెచ్‌ఎం, సచివాలయం సిబ్బంది చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోతోందని ఆవేదన వ్యక్తంచేశాడు. గతంలో అమ్మఒడి అందేదని, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పథకం వర్తింపజేయాలంటూ వేడుకుంటున్నాడు.
– మెరకముడిదాం