
సిరిమాను వచ్చింది..సంబరం తెచ్చింది
విజయనగరం టౌన్/గంట్యాడ:
గంట్యాడ మండలం కొండతామరాపల్లి గ్రామంలో సాక్షాత్కరించిన పైడితల్లి సిరిమాను, ఇరుసుమానులను భక్తుల జయజయ ధ్వానాలు, మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, పసుపు నీటి చల్లదనాల మధ్య బుధవారం తరలించారు. ముహూర్తం ప్రకారం ఉదయం 8.30 గంటలకు సిరిమానుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఆలయ పూజరి బంటుపల్లి వెంకటరావు, ఆలయ ఈఓ శీరిష తదితరులు గొడ్డలివేటు వేసి తొలగింపు పనులకు శ్రీకారం చుట్టారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, వైఎస్సార్ సీపీ యువజన నాయకుడు ఈశ్వర్ కౌశిక్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎస్.వి.వి.రాజేష్, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగంరెడ్డి బంగారునాయుడు తదితరులు సిరిమాను చెట్టుకు పూజలు చేశారు. చెట్టుపై గొడ్డలివేటు వేశారు.
అమ్మవారు జిల్లా ప్రజలను చల్లగా చూడాలని ఆకాంక్షించారు. కొండతామరాపల్లితో పాటు పరిసర గ్రామాల ప్రజలు సిరిమాను చెట్లవద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు వర్రి నరసింహామూర్తి, సర్పంచ్ కొడెల ముత్యాలనాయుడు, తహసీల్దార్ నీలకంటేశ్వర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
● సిరిమాను చెట్టు తరలింపు ఇలా..
పైడితల్లి అమ్మవారి ప్రతిరూపమైన సిరిమాను, ఇరుసుమానులను కొలతల ప్రకారం వడ్రంగులు ముక్కలు చేసి ఎడ్లబండిపై కొండతామరాపల్లి గ్రామం నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో బయలుదేరారు. గంట్యాడ, నరవ, లక్కిడాం, రామవరం, మీదుగా అయ్యన్నపేట కూడలికి రాత్రి 10 గంటలకు సిరిమాను చేరుకుంది. కణపాక, కె.ఎల్.పురం, పావనీనగర్, ఉడాకాలనీ, కంటోన్మెంట్, బొగ్గులదిబ్బ, దండుమారమ్మ తల్లి ఆలయ సమీప ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవారికి చల్లదనం చేశారు. పోలీస్ బ్యారెక్స్, ఆర్‌సీఎం స్కూల్, ఎత్తుబ్రిడ్డి మీదుగా రైల్వేస్టేషన్ రోడ్డులోని వనంగుడి వద్దకు చేరుకున్న సిరిమానుకు ప్రత్యేక పూజలు చేవారు. అక్కడ నుంచి గాడీఖానా, ఎన్‌సీఎస్ రోడ్డు, కన్యకాపరమేశ్వరి ఆలయం, గంటస్తంభం, శివాలయం వీధి మీదుగా హుకుంపేట రామమందిరం నుంచి పూజారి ఇంటివద్దకు రాత్రి 2 గంటల తర్వాత సిరిమాను చేరుకుంది. గురువారం నుంచి చింతచెట్లను సిరిమాను, ఇరుసుమానుగా మలిచే ప్రక్రియను వడ్రంగులు చేపట్టనున్నారు.
● సిరిమాను తరలింపులో అపశృతి
సిరిమాను తరలించే ప్ర క్రియలో అపశృతి చో టుచేసుకుంది. రాత్రి 7.30 గంటలకు రామవరం వరకూ సజావు గా ఎడ్లబండిపై వస్తు న్న సిరిమాను బరువు కు బండి చక్రం ఒక్క సారి విరిగింది. అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది వెంటనే కర్ర లతో దానిని నిలబెట్టించి, వడ్రంగుల సాయంతో చక్రాలను మార్చా రు. అక్కడ నుంచి యువకులే బండిని లా గారు. ఎట్టకేలకు హుకుంపేటకు సిరిమానును చేర్చడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
కొండతామరాపల్లి నుంచి
హుకుంపేటకు సిరిమాను చెట్టు
తరలింపు
దారి పొడవునా పసుపునీటితో
చల్లదనం
సిరిమాను చెట్టును తాకి తన్మయత్వం పొందిన భక్తులు
నేటి నుంచి హుకుంపేటలో సిరిమానుగా మలిచే ప్రక్రియ

సిరిమాను వచ్చింది..సంబరం తెచ్చింది

సిరిమాను వచ్చింది..సంబరం తెచ్చింది

సిరిమాను వచ్చింది..సంబరం తెచ్చింది