వంగర: అల్పపీడన ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 7 వేల క్యూసెక్కుల నీరు మడ్డువలస ప్రాజెక్టులో చేరుతోంది. ప్రాజెక్టు వద్ద బుధవారం 64.31 మీటర్ల మేర నీటిమట్టం నమోదైంది. రెండు గేట్లు ఎత్తి 9 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నట్టు ఏఈ నితిన్ తెలిపారు.
దాడితల్లికి మహానైవేద్యం
బొబ్బిలి: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బొబ్బిలి పట్టణం బైపాస్ రోడ్డులోని దాడితల్లి ఆలయంలో అమ్మవారికి 108 రకాల ప్రసాదాలు, స్వీట్లు, పండ్లతో భక్తులు బుధవారం మహా నైవేద్యం సమర్పించారు. అన్నపూర్ణగా అవతరించిన అమ్మవారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ పురోహితుడు పిండిప్రోలు మణికుమార్ శర్మ అమ్మవారికి అర్చనలు జరిపి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

మడ్డువలస వద్ద 9వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో