
పిడుగు పడి పశువుల కాపరి మృతి
బొండపల్లి: పాడి పశువులను మేతకు తోలిన పశువుల కాపరిపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బొండపల్లి మండలంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గంట్యాడ మండలంలోని పెద్దమజ్జి పాలెం గ్రామానికి చెందిన సుంకరి సూర్యనారాయణ(63) తన పాడి పశువులను మేత కోసం బొండపల్లి మండలంలోని వెదురువాడ గ్రామ రెవెన్యూలోని చింతల తోపు వద్దకు తోలాడు. ఈ క్రమంలో పశువులను మేపుతూ కాపలాగా ఉండగా సాయంత్రం ఉరుములు,మెరుపుల వర్షంతో పాటు పిడుగులు పడగా పిడుగు పాటుకు గురై అక్కడిక్కడే మృత్యువాత పడ్డాడు. గమనించిన తోటి రైతులు కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు తహసీల్దార్ డోలా రాజేశ్వర్రావుతో పాటు, ఎస్సై యు.మహేష్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.