
సిరిమాను చెట్టును దర్శించిన బొత్స, బెల్లాన, చిన్న శ్రీన
గంట్యాడ: ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమాను చెట్టును మండలంలోని కొండతామరపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మజ్జి శ్రీనివాస్‌రావు(చిన్న శ్రీను), గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌లు మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సిరిమాను చెట్టుకు పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏటా పైడితల్లి అమ్మవారి సిరిమాను చెట్టును దర్శించుకుంటున్నామని తెలిపారు. అమ్మవారు జిల్లా ప్రజల అందరిని చల్లగా చూడాలని కోరుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వర్రి నరసింహమూర్తి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ.సూర్యనారాయణ రాజు(పులిరాజు), పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు జాగరపు అప్పారావు, మాజీ ఏఎంసీ చైర్మన్ వేమలి ముత్యాలనాయుడు, వైఎస్సార్‌సీపీ జామి మండల అధ్యక్షుడు గొర్లె రవికుమార్, వేపాడ ఎంపీపీ దొగ్గ సత్యవంతుడు, గంట్యాడ మండల యువజన విభాగం అధ్యక్షుడు కొండెల విజయ్‌కుమార్, కొండతామరాపల్లి సర్పంచ్ కోడెల ముత్యాలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

సిరిమాను చెట్టును దర్శించిన బొత్స, బెల్లాన, చిన్న శ్రీన