
ఎస్పీ చాంబర్‌లోనే ఫిర్యాదుల స్వీకరణ
విజయనగరం క్రైమ్: జిల్లాకు ఇటీవల కొత్తగా వచ్చిన ఎస్పీ ఏఆర్ దామోదర్ తన చాంబర్‌లోనే సోమవా రం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 31 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో ఎనిమిది భూతగాదాలకు సంబంధించినవి కాగా, కుటుంబ కలహాలకు సంబంధించినవి నాలుగు, మోసాలకు పాల్పడినట్టు ఐదు, నగ దు వ్యవహారాలకు సంబంధించి ఒకటి, ఇతర అంశాలకు సంబంధించి 13 ఫిర్యాదులు వచ్చాయి. అర్జీదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్య లత, ఎస్‌బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్‌బీ సీఐ బి. సుధాకర్, ఎస్‌ఐ ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు.