
పశుసంవర్థక శాఖ జేడీగా మురళీకృష్ణ
విజయనగరంఫోర్ట్: పశు సంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్‌గా డాక్టర్ కె.మురళీకృష్ణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన భీమవరం జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసి బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి పశువులకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు కృషిచేస్తానన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని తెలిపారు.
వర్షాలు కురుస్తాయి.. జాగ్రత్త..!
● కలెక్టరేట్ కంట్రోల్ రూం: 08922–236947
విజయనగరం అర్బన్: రాబోయే ఐదు రోజుల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందని కలెక్టర్ రామసుందర్ రెడ్డి సోమవారం తెలిపారు. ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా జరిగే నష్టాలను కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 08922–236947కు తెలియజేయాలని సూచించారు. జిల్లాలో స్వచ్ఛాంధ్ర ర్యాంక్ మెరుగుపడేలా అధికారులు పని చేయాలని కలెక్టర్ సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగం, పారిశుద్ధ్య నిర్వహణ పనులపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో సీపీఓ పి.బాలాజీ, సీఈఓ సత్యనారాయణ, డీపీఓ మల్లికార్జునరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత, మున్సిపల్ కమిషనర్లు నల్లనయ్య, రామలక్ష్మి, అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.
పీజీఆర్‌ఎస్‌కు 240 వినతులు
విజయనగరం అర్బన్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావినతులు పరిష్కార వేదికకు 240 వినతులు అందాయి. అర్జీలను కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి స్వీకరించారు. అత్యధికంగా రెవెన్యూ సమస్యలపై 106 వినతులు అందాయి. వీటిని పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

పశుసంవర్థక శాఖ జేడీగా మురళీకృష్ణ

పశుసంవర్థక శాఖ జేడీగా మురళీకృష్ణ