
సిరిమాను చెట్టు ఊరేగింపునకు కసరత్తు
100 మందితో బందోబస్తు
విజయనగరం క్రైమ్: ఈనెల 24 వ తేదీన శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను చెట్టు ఊరేగింపునకు విజయనగరం రూరల్ పోలీస్‌స్టేషన్ సీఐ లక్ష్మణరావు బందోబస్తు విషయమై ఆదివారం చర్చించారు. గంట్యాడ మండలం కొండతామరాపల్లిలో సిరిమాను చెట్టును ఆలయ అనువంశిక పూజారి గుర్తించారు. కొండతామరాపల్లి నుంచి సిరిమాను చెట్టును విజయనగరంలో ఆలయ పూజారి ఉంటున్న హుకుంపేటకు తీసుకువచ్చేందుకు రూట్ మ్యాప్, బందోబస్తుకోసం విజయనగరం రూరల్ సీఐ లక్ష్మణరావు, గంట్యాడ ఎస్సై కృష్ణమూర్తి స్టేషన్‌లో చర్చించారు. దాదాపు వందమంది పోలీస్ సిబ్బంది అవసరమని గుర్తించారు. ఈ మేరకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.