
బాల్యంలోనే.. బానిసలు కావద్దు
రామభద్రపురం: మాదక ద్రవ్యాల వినియోగంలో అధిక శాతం మైనర్లే ఉంటున్నారు. బాలలపై కేసులు నమోదైతే వారి భవిష్యత్తు అంధకారంలోకి వెల్లిపోతుంది. ఏది మంచో, ఏది చెడో తెలియని వయసులో విద్యార్థులు తప్పుడు విషయాలను బుర్రకెక్కించుకుటున్నారు, డ్రగ్స్, గంజాయి, ర్యాగింగ్‌లు, సైబర్ నేరాల పట్ల ఆకర్షితులవుతున్నారు. అవి విపరీతమైన అనర్థాలను కలిగిస్తున్నాయి.అయితే సంకల్పం కార్యక్రమం పేరతో చెడు వ్యవసనాల వల్ల కలుగుతున్న అనర్థాలను ఆపడానికి పోలీసుశాఖ నడుం బిగించింది. ప్రభుత్వం,ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యాజమాన్య ప్రతినిధుల ఆధ్వర్యంలో సీఐ నారాయణరావు, ఎస్సై ప్రసాదరావులు ప్రొజెక్టర్‌పై వివిధ అంశాలను ప్రదర్శిస్తూ సమాజంలో విద్యార్థులకు సోషల్ మీడియా, డ్రగ్స్, గంజాయి, ర్యాగింగ్ సైబర్ నేరాలు, గుడ్‌టచ్, బ్యాడ్ టచ్ వల్ల జరుగుతున్న నష్టాలను వివరిస్తున్నారు.
అప్రమత్తంగా ఉంటాను
సైబర్ నేరానికి గురైతే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలిసేది కాదు. పోలీసు అధికారులు 1930,112 నంబర్లకు ఫోన్ చేయాలని వివరించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని,స్నేహితులకు, తల్లిదండ్రులకు చెబుతాను. ఓటీపీ బయట వారికి తెలియకుండా జాగ్రత్తపడతాం. సెల్‌ఫోన్ నంబర్లు, వ్యవక్తిగత వివరాలు, ఫొటోలు ఎవరికీ పంపకూడదని ఈ అవగాహన ద్వారా నాకు అర్థమైంది.
– సీహెచ్ శరణ్య, 10వ తరగతి విద్యార్థిని, రామభద్రపురం

బాల్యంలోనే.. బానిసలు కావద్దు