
గిరిజన ప్రాంతాల టీచర్ పోస్టులు గిరిజనులకే కేటాయించాలి
● ట్రైబల్ రైట్స్ ఫోరం జిల్లా కమిటీ డిమాండ్
విజయనగరం అర్బన్: గిరిజన ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను శతశాతం గిరిజనులకే కేటాయించి భర్తీ చేయాలని ట్రైబల్ రైట్స్ ఫోరం చైర్మన్ డాక్టర్ వరహాలదొర డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక యూత్ హాస్టల్‌లో ఆదివారం జరిగిన జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివాసీల సమస్యల పరిష్కారానికి ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఆదివాసీ గ్రామాన్ని సందర్శించి, యువతీ యువకులను చైతన్యపరిచి ఉద్యోగాలు, వ్యాపార రంగాలలో స్థిరపడేలా చేయాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు రొబ్బా లోవరాజు మాట్లాడుతూ జిల్లాలో గిరిజనులు అనేక సమస్యలతో బాధపడుత్నురని కొత్తగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులు వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. నిరుద్యోగ గిరిజన యువత సరైన అవగాహన లేక ఇంటికే పరిమితమపుతున్నారని వారికి నైపుణ్యాభివృద్ధి ప్రోగ్రాంలు, ట్రైనింగ్, ఉద్యోగావకాశాలపై అవగాహన కల్పించేందుకు మండల కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రమోద్, మహిళా విభాగం అధ్యక్షురాలు నంద్యాల గిరిజ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఐఎన్‌ఎస్‌దొర, ప్రధాన కార్యదర్శిగా రాయల ధనంజయ్, ఉపాధ్యక్షులుగా బెటికరి ప్రసాద్‌రావు, జలుమూరి రామారావు, కోశాధికారిగా జోడు నాగరాజు, సహాయ కార్యదర్శులుగా ఎం.పండు, జె.రామారావులను ఎన్నుకున్నారు. అదే విధంగా ట్రైబల్ స్టూడెండ్స్ రైట్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడిగా హిమరిక గణేష్, ప్రధాన కార్యదర్శిగా పక్కి నవీన, ఉపాధ్యక్షులుగా సిధారపు పవన్, కిల్లక రోజా, కొప్పుల వాసవి, చోడిపల్లి గంగోత్రి, ఎ.కిరణ్ ఎంపికయ్యారు. ట్రైబల్ ఎంప్లాయిస్ రైట్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడిగా కొండగొర్ర గోపాల్, ప్రధాన కార్యదర్శిగా మానపురం వెంకటరమణను ఎన్నుకున్నారు.