
జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపి
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న జూనియ ర్స్ బాల, బాలికల అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనబో యే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలకు ఆదివారం పూర్తయ్యాయి. నగర శివారులో గల విజ్జి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఎంపిక పోటీలను ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ప్రారంభించారు. ఈ పోటీలకు ఉమ్మడి విజయనగరం జిల్లా నలు మూలల నుంచి సుమారు 300 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. వారికి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్స్, త్రో, జంప్స్ అంశాల్లో ఎంపికలు నిర్వహించగా.. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 27 28,29 తేదీల్లో ఏలూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు విజ యనగరం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సీతారామరాజు, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ కేవీఎన్ రాజు, జిల్లా అథ్లెటి క్స్ అసోసియేషన్ సభ్యులు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.

జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపి

జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా క్రీడాకారుల ఎంపి