
ప్రజల ఆరోగ్యాన్ని లెక్కచేయని ప్రైవేటీకరణ
● ఎమ్మెల్సీ సురేష్‌బాబు
భోగాపురం: రాష్ట్రప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో నడపాలని తీసుకున్న నిర్ణయం ప్రజల ఆరోగ్య భద్రతకు తీవ్ర ముప్పు తెచ్చిపెడుతుందని ఎమ్మెల్సీ సురేష్‌బాబు విమర్శించారు. ‘ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తున్న మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ పేరుతో అప్పగించడం తప్పుడు నిర్ణయం. ప్రైవేట్ యాజమాన్యం వస్తే ప్రజలకు చికిత్స ఖర్చులు గగనానికి ఎగుస్తాయి. కరోనా సమయంలో ప్రభుత్వ ఆస్పత్రులే ప్రజల ప్రాణాలు కాపాడాయి. రేపు కొత్త వైరస్ వస్తే కేరళలో జరుగుతున్నట్లు పరిస్థితులు తలెత్తితే పేదలకు వైద్యం అందకపోవచ్చు’’ అని సురేష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడే ప్రభుత్వ వైద్యరంగాన్ని ప్రైవేటీకరణకు అప్పగించకుండా వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎంపీపీ ఉప్పాడ అనూష రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.