
నిత్యస్మరణీయులు గురజాడ
● మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ● ఘనంగా మహాకవి 163 జయంతి
విజయనగరం టౌన్:
నిత్యస్మరణీయులు గురజాడ అని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొనియాడారు. మహాకవి 163వ జయంతిని ఆదివారం విజయనగరంలోని గురజాడ స్వగృహంలో నిర్వహించారు. గురజాడ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సత్య కూడలి సమీపంలోని గురజాడ విగ్రహం వరకూ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గురజాడ దేశభక్తి గేయాలను ఆలపించారు. అక్కడ ఉన్న కాంస్య విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటుచేసిన జయంతి సభలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ అందరికీ అర్ధమయ్యే వాడుక భాషలో గురజాడ చేసిన రచనలు కలకాలం నిలిచిఉంటాయన్నారు. దేశప్రధాని మోదీ సైతం గురజాడ రచనల నుంచి స్ఫూర్తి పొందారని, ఆయన రాసిన దేశభక్తి గేయాన్ని ప్రస్తావించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. గురజాడ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించేందుకు కృషిచేస్తామన్నారు. గురజాడ గొప్పదనాన్ని నేటితరానికి తెలియజేసేందుకు ప్రతి పాఠశాలలో ఆయన చిత్రపటం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గురజాడ స్వగృహం పక్కనున్న స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
●కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ గురజాడ గొప్ప సంఘసంస్కర్త అని పేర్కొన్నారు. తెలుగు భాష నిలిచి ఉన్నంతవరకూ గురజాడ రచనలు నిలిచి ఉంటాయన్నారు. ఆయన కన్యాశుల్కంలో సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పపంతులు వంటి పాత్రలు ఇప్పుడూ మన కళ్లముందే కదలాడుతుంటాయన్నారు. గురజాడ రాసిన దేశ
గా నిలిచి ఉంటాయన్నారు. గురజాడ భావాలు, ఆలోచనలు, ఆశయాలు, భావితరాలకు అందించేందుకు కృషిచేయాలని కోరారు. గురజాడ స్వగృహం అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.10 లక్షలు కేటాయిస్తామని ప్రకటించారు.
●తూర్పుకాపు కార్పొరేషన్ చైర్‌పర్సన్ పాలవలస యశస్వి, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి, గురజాడ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ ఎం.వెంకటేశ్వరరావు, కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ మహాకవి గొప్పతనాన్ని వివరించారు. కార్యక్రమంలో జేసీ సేతు మాధవన్, డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ డి.కీర్తి, డీఈఓ మాణిక్యంనాయుడు, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, డీఐపీఆర్‌ఓ గోవిందరాజులు, జిల్లా పర్యాటక అధికారి కుమారస్వామి, మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మండపాక నాగలక్ష్మి, గురజాడ కుటుంబ సభ్యులు వెంకటేశ్వర ప్రసాద్, ఇందిర, లలిత, ప లువురు సాహితీ సంఘాల ప్రతినిధులు, నాయకు లు, అధికారులు, సాహితీప్రియులు పాల్గొన్నారు.
మును ప్రేమించుమన్నా.. దేశభక్తి గేయం మనందరికీ ఆదర్శమని, దేశం పట్ల పౌరుల బాధ్యతను గుర్తుచేస్తుందన్నారు. ప్రపంచంలోని విభిన్న సాహిత్యాలను అధ్యయనం చేసిన గురజాడ, తెలుగు జా తికి అపూర్వ రచనల అందించారని కొనియాడారు.
●ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ ఎన్ని తరాలు మారినా గురజాడ రచనలు సజీవం

నిత్యస్మరణీయులు గురజాడ